వరుస సినిమాతో దూసుకుపోతున్నాడు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. వరుస సినిమాలే కాదు.. వరుస సక్సెస్ లు కూడా చైతూలో జోష్ పెంచేస్తున్నాయి. ఇక ఇప్పుడు త్వరలో థ్యాంక్యూ సినిమాతో రాబోతన్నారు. ఈమూవీ నుంచి  ఈరోజు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు టీమ్.

అక్కినేని న‌ట‌వార‌సుడు నాగచైతన్య మంచి జోరుమీద ఉన్నారు. ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. త‌న నట‌న‌, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ‌చైతన్య‌. ఆ మధ్య వరుస ఫేయిల్యూర్స్ చూసిన యంగ్ హీరో .. ఇప్పుడు వరుసగా ల‌వ్‌స్టోరీ, బంగార్రాజు లాంటి వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్నాడు. అంతే కాదు చైత‌న్య హ్య‌ట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ య‌ంగ్ హీరో న‌టించిన థాంక్యూ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. 

 విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూలై 8న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. వ‌రుస అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నారు. తాజాగా మేక‌ర్స్ మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈరోజు సాయంత్రం సాలిడ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. 

Scroll to load tweet…

ఈ సినిమాలోని ఏంటో ఏంటోంటో అంటూ సాగే మెలోడియ‌స్ సాంగ్‌ను గురువారం సాయంత్రం 5గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను జోనిత గాంధి ఆల‌పించింది. ఇదివ‌ర‌కే థ్యాంక్యూ మూవీ నుంచి విడుద‌లైన మారో మారో సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు మరో సాంగ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు టీమ్. 

రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్‌లుగా న‌టించారు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ప‌నిచేశాడు. శ్రీవెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మించారు.