Asianet News TeluguAsianet News Telugu

అదిరిపోయిన 'తండేల్' టీజర్, మనం చూస్తున్నది నాగ చైతన్యనేనా.. అసలు కథ రివీల్ చేసేశారుగా

కొద్దిసేపటి క్రితమే తండేల్ టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో ఈ స్పెషల్ వీడియో ఉంది. సినిమా ఓవర్ లుక్, కథలోని మెయిన్ పాయింట్ రివీల్ అయ్యేలా టీజర్ ని ప్రజెంట్ చేశారు.

Naga Chaitanya thandel movie teaser out now dtr
Author
First Published Jan 6, 2024, 1:12 PM IST

చైతు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తండేల్'. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన చందు ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి నుంచి ఈ చిత్రంపై హైప్ పెంచుతున్నారు. చైతు ఈ చిత్రంలో బోట్ నడిపే మత్స్యకారుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాత ఈ కథని నమ్మడంతో చందూ ముండేటి పెద్ద ప్రయత్నమే చేస్తున్నట్లు అర్థం అయిపోయింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర టీజర్ కోసం ఫ్యాన్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. శుక్రవారం రోజే విడుదల కావాల్సిన టీజర్ టెక్నికల్ సమస్యల వల్ల రిలీజ్ కాలేదు. 

కాగా నేడు కొద్దిసేపటి క్రితమే తండేల్ టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో ఈ స్పెషల్ వీడియో ఉంది. సినిమా ఓవర్ లుక్, కథలోని మెయిన్ పాయింట్ రివీల్ అయ్యేలా టీజర్ ని ప్రజెంట్ చేశారు. నాగ చైతన్య ట్రాన్స్ఫర్మేషన్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మనం చూస్తున్నది నాగచైతన్యనేనా అని ఆశ్చర్యపోయేలా చైతు జాలరి పాత్రలో ఒదిగిపోయాడు. 

ఆంధ్రప్రదేశ్ కి చెందిన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ లో చిక్కుకున్న సంఘటన గతంలో జరిగింది. శ్రీకాకుళంకి చెందిన జాలరులు గతంలో పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడ ఆర్మీకి చిక్కారు. కొంతకాలం తర్వాత విడుదలయ్యారు. అదే పాయింట్ తో చందుముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజర్ లో రివీల్ చేసిన అంశం కూడా అదే. 

'దద్దా గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురితెప్పేదేలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే' అంటూ నాగచైతన్య శ్రీకాకుళ యాసలో చెప్పే డైలాగులతో టీజర్ మొదలవుతుంది. నాగ చైతన్య వల విసురుతూ రఫ్ లుక్ లో అమేజింగ్ గా ఉన్నాడు. ఇంతలో పాకిస్తాన్ నేవికి సంబందించిన సౌండ్ వస్తుంది. కట్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు నాగ చైతన్యని , అతడి స్నేహితులని అరెస్ట్ చేస్తారు. 

జైలులో నాగ చైతన్యని పాకిస్తాన్ పోలీసులు చిత్ర హింసలు పెట్టడం చూడొచ్చు. అయితే పాకిస్తాన్ పోలీసులతో నాగ చైతన్య చెప్పే డైలాగులు టీజర్ కే హైలైట్. మీలాంటి దేశానికి దేశ భక్తా అని వెటకారంగా పాకిస్తాన్ పోలీస్ అడుగుతాడు. నాగ చైతన్య బదులిస్తూ 'మా నుంచి ఊడిపోయిన ఒక ముక్క మీకే అంతుంటే.. ఆ ముక్కని ముష్టి వేసిన మాకెంతుండాలి అని కౌంటర్ ఇవ్వడం బావుంది. పాకిస్తాన్ గడ్డపై చెబుతున్నా భారత్ మాతాకీ జై అని చైతు పౌరుషంగా చెప్పే డైలాగులు బావున్నాయి. 

టీజర్ చివర్లో చైతు ప్రేయసిగా సాయి పల్లవి అందంగా మెరిసింది. ఓవరాల్ గా తండేల్ టీజర్ బ్యూటిఫుల్ విజువల్స్, నాగ చైతన్య క్రేజీ లుక్, డైలాగ్స్ తో అదిరిపోయింది అనే చెప్పాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios