చైతు, సమంతల మధ్యలోకి మంచు మనోజ్!

First Published 11, May 2018, 3:51 PM IST
naga chaitanya samantha and manchu manoj's twitter talk
Highlights

టాలీవుడ్ లో 'మహానటి' క్రేజ్ మాములుగా లేదు. ఎక్కడ చూసిన ఎవరేం మాట్లాడుకున్నా అది మహానటి గురించే

టాలీవుడ్ లో 'మహానటి' క్రేజ్ మాములుగా లేదు. ఎక్కడ చూసిన ఎవరేం మాట్లాడుకున్నా అది మహానటి గురించే. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను పొగుడుతూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాను మెచ్చుకుంటూ కొన్ని ట్వీట్లు చేశారు. ''మహానటి లాంటి గొప్ప సినిమాలో నేను ఓ భాగమయ్యాను. ఈ అవకాశం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఇంతమంచి పాత్ర నాకు ఇచ్చిన వైజయంతీ, స్వప్న సినిమా, నాగ్ అశ్విన్ లకు థాంక్స్. సెల్యూట్ టు సావిత్రి గారు..'' అని ఒక పోస్ట్ పెట్టి రెండో పోస్ట్ లో...

''కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలపై గౌరవం మరింత పెరిగింది. మీ నుండి నేను చాలా నేర్చుకోవాలి. ఇది నిజంగా స్పూర్తిదాయకం. దీనికి అంతం లేదు. అద్భుత దృశ్యకావ్యం'' అని చైతు చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ సమంత.. 'ఓకే ఓకే దయచేసి ఇప్పుడు మీరు ఇంటికి రండి' అంటూ స్పందించింది. వీరిద్దరి ట్వీట్స్ చూసిన మంచు మనోజ్ మధ్యలో ఎంటర్ అయి 'బుక్ అయిపోయావ్ రా బాబాయ్ నా చెల్లెలి చేతిలో..' అని ట్వీట్ చేయగా, ఓ నెటిజన్ కల్పించుకొని బాబాయ్, చెల్లి ఇదేం వరస అని ప్రశ్నించాడు. దీనికి 'ప్రేమగా ఎవరిని ఎలా పిలిచినా పలుకుతారు' అంటూ మంచు మనోజ్ సమాధానమిచ్చాడు. 

loader