Asianet News TeluguAsianet News Telugu

'లవ్ స్టోరి' ఫస్ట్ డే కలెక్షన్స్.. సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే హైయెస్ట్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ. శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద సందడి తీసుకువచ్చిన చిత్రం ఇది.

Naga Chaitanya, Sai Pallavi Love Story Movie first day box office collections
Author
Hyderabad, First Published Sep 25, 2021, 12:25 PM IST

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ. శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద సందడి తీసుకువచ్చిన చిత్రం ఇది. సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్స్ షట్ డౌన్ అయ్యాయి. గత కొన్ని వారాలుగా పరిస్థితి మెరుగవుతూ వచ్చింది. 

కానీ ఇపప్పటికీ నిర్మాతలు తమ చిత్రాలని థియేటర్స్ లో రిలీజ్ చేయాలంటే భయపడుతున్నారు. ఏపీలో థియేటర్స్ సమస్య, టికెట్ల వివాదం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే వసూళ్లపై ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ లవ్ స్టోరీ నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. 

తొలి రోజే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల చిత్రం కావడం, సాయి పల్లవి పై యువతలో క్రేజ్ ఉండడం, నాగ చైతన్య అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించడంతో ప్రేక్షకులు తొలిరోజే థియేటర్స్ కి ఎగబడ్డారు. ఫలితంగా లవ్ స్టోరీ చిత్రం తొలి రోజు అదిరిపోయే వసూళ్లు అందుకుంది. 

ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 10 కోట్ల వరకు షేర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వసూళ్లు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ మొత్తంలో 3 కోట్లకు పైగా షేర్ నైజాం ఏరియా నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. సెకండ్ వేవ్ తర్వాత తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా లవ్ స్టోరీ రికార్డ్ సృష్టించింది. రానున్న రోజుల్లో కూడా ఏ చిత్ర వసూళ్లు స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్,  రామ్ మోహన్ రావు నిర్మించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios