మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన మజిలీ సినిమా మొదటి మూడు రోజులు బాక్సాఫీసుని షేక్ చేసేస్తోంది. ఎఫ్ 2 సినిమా తర్వాత ఆ స్దాయిలో హౌస్ ఫుల్ బోర్డ్ లు రెండు రాష్ట్రాల్లోనూ కనిపించాయి. మొన్న శుక్రవారం విడుదలైన మజిలీ సినిమా మంచి ఓపినింగ్స్ ని రాబట్టి... నాగ చైతన్య కెరీర్ లో  ఫస్ట్ డే ... సెకండ్ హైయ్యెస్ట్ గ్రాస్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

సమ్మర్ హాలిడేస్ లో వచ్చిన  మొదటి సినిమా కావడం, సమంత - చైతన్య కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ కారణంగా సినిమాకి స్టన్నింగ్ కలెక్షన్లు వచ్చయనటంలో సందేహం లేదు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ బాగానే రాబట్టినా సోమవారం నుంచి డ్రాప్ కనపడింది. అయితే ఎక్కువ రేంజ్లో డ్రాప్ రాలేదు. నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. 

అయితే మంగళవారం బాగా డ్రాప్ అయింది. బుధవారం కూడా పెద్దగా కోలుకున్నట్లు కనపడటం లేదు. ఆంధ్రాలో అయితే ఎలక్షన్ వేడితో జనం సినిమాలపై దృష్టి పెట్టడం లేదు అంటున్నారు. ఎల్లుండి నుంచి అంటే  మళ్లీ ఈ వీకెండ్ ఈ సినిమా పుంజుకుంటుందని భావిస్తున్నారు  ట్రేడ్ విశ్లేషకులు.

అయితే ఈ సినిమా ఇప్పటికే హిట్ అనిపించుకోవటంతో అక్కినేనికుటుంబం ఫుల్ జోష్ లో ఉంది.  అయితే ఈ సక్సెస్ రేంజ్ ఏంటనేది వచ్చే వీకెండ్ భాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ ఫార్మ్ చేస్తుందనే విషయంపై ఆధారపడుతుంది. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ నటించిన "చిత్రలహరి" సినిమాతో ఈ వీకెండ్ ఈ మూవీ పోటీపడాలి.  

ఈ సినిమాకు నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన సంగీతం సినిమాకు ఎమోషనల్ కనెక్టివిటిని సెట్ చేస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మొత్తానికి డైరక్టర్  శివ నిర్వాణ ద్వితీయ విఘ్నాన్ని సక్సెస్‌ఫుల్‌గా దాచేశాడు.