మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రంలో  నాగచైతన్య ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ను ఈ నెలాఖరులో కశ్మీర్‌లోని కార్గిల్‌లో జరిపేందుకు సన్నాహాలు చేసారు. దాదాపు 45రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కార్గిల్‌ నేపథ్య యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించటానికి ప్లాన్ చేసారు.

 ఇందులో నాగచైతన్య పాల్గొనబోతున్నారు. సినిమాలో కీలమైన ఈ షెడ్యూల్‌లో నాగచైతన్యపై ముఖ్యఘట్టాల్ని చిత్రీకరించనున్నారు. అయితే ఈ షూట్ ని హోల్డ్ లో పెట్టారని సమాచారం. కరోనా సమస్యలుతో ఈ షూట్ ని హోల్డ్ లో పెట్టారా లేక, వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

 నాగచైతన్య నటిస్తున్న తొలి బాలీవుడ్‌ చిత్రమిదే కావడం విశేషం. హాలీవుడ్‌లో పెద్ద హిట్టైన ‘ఫారెస్ట్‌ గంప్‌’ (1994) చిత్రానికి రీమేక్‌ ఇది.అద్వైత్‌చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్‌మస్‌కు ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. 

మరోవైపు నాగ చైతన్య తన తదుపరి తెలుగు చిత్రం థాంక్స్ షూటింగ్ కోసం ఇటీవల ఇటలీకి వెళ్లారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్. ఇందులో చైతన్య మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2021 ద్వితీయార్థంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కోవిడ్ -19 రెండవ వేవ్ కారణంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన అతని తదుపరి విడుదల లవ్ స్టోరీ వాయిదా పడింది.