Naga Chaitanya: `తండేల్‌` షూటింగ్‌లో షాకింగ్‌ ఇన్సిడెంట్‌, పోలీస్‌ అరెస్ట్ వరకు వెళ్లిందా?

Naga Chaitanya about Thandel: నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన `తండేల్‌` మూవీ షూటింగ్‌లో ఓ షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటు చేసుకుంది. పోలీసులు టీమ్‌ని అరెస్ట్ చేశారట. మరి ఆ కథేంటో నాగచైతన్య వెల్లడించారు. 
 

Naga Chaitanya reveals shocking incident in Thandel shooting and about sai pallavi in telugu arj

Naga Chaitanya about Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా `తండేల్‌` చిత్రంలో నటించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఈ మూవీ ఈ శుక్రవారం(ఫిబ్రవరి 7)న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీమ్‌. ఈ క్రమంలో తాజాగా నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. షూటింగ్‌లో సమయంలో చోటు చేసుకున్న ఇన్సిడెంట్స్ గురించి ఆయన పంచుకున్నారు. 

`తండేల్‌` షూటింగ్‌లో అరెస్ట్..

కేరళాలో కోస్ట్‌ గార్డ్ పోలీసులు టీమ్‌ని అరెస్ట్ చేశారట. కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసి కెమరామెన్ అందరినీ తీసుకెళ్ళారు. అది పెద్ద రచ్చ అయ్యిందని తెలిపారు నాగచైతన్య. అంతేకాదు ఒకసారి బోట్ కొలాప్స్ అయిపోయిందట. తాజాగా చైతూ ఈ విసయాన్ని వెల్లడించారు. దీంతోపాటు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని కలిసినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించిందని, వాళ్లతో చాలా టైం స్పెండ్ చేసినట్టు తెలిపారు. వాళ్ళలో ఒక నిజాయితీ కనిపించిందన్నారు. 

`తండేల్‌` లో ఛాలెంజింగ్‌ పార్ట్ అదే..

`తండేల్‌` సినిమాలో రాజు ఫైటర్. జైల్లో ఉన్నప్పుడు  బాధని ఓర్చుకొని తన వారికోసం ఎలా పోరాటం చేశాడు ఎలా బయటికి వచ్చాడనేది చాలా గొప్పగా వుంటుంది. తన ప్రేమకథే తనకి బలాన్ని ఇస్తుందని చెప్పారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ దొరికింది కాబట్టి ఈ కథ విసయంలో మోటివేట్ అయ్యాను. యాక్టర్ గా నెక్స్ట్ స్టెప్ వెళ్ళే అవకాశం ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ ఫర్మేషన్ మీదే వున్నాను. శ్రీకాకుళం యాస గురించి ట్యూషన్ తీసుకున్నాను. యాస రియల్లీ ఛాలెజింగ్ గా అనిపించిందని చెప్పారు నాగచైతన్య.   

`తండేల్‌` లవ్‌ స్టోరీ వెనుక లేయర్స్..

`చందుతో నాకు ఇది మూడో సినిమా. తనతో ట్రావెల్ అవ్వడం ఇష్టం. నన్ను కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నా కోసమే ఆలోచిస్తుంటాడు. ఈ సినిమా కమర్షియల్ గా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. సినిమాలో అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. లవ్ స్టొరీ వెనుక మిగతా లేయర్స్ వుంటాయి.  

`తండేల్‌` గుజరాతీ వర్డ్..

‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ వర్డ్. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడ బోట్స్ ని లీజ్ కి తీసుకొని ఫిషింగ్ చేసుకొని అక్కడే అమ్మి తిరిగివస్తారు. సినిమాని దాదాపు సముద్రంలో షూట్ చేశాం. రియల్ లొకేషన్ లో షూట్ చేయడం పెర్ఫార్మెన్స్ కి కూడా ప్లస్ అవుతుంది. జైల్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్ గా వుంటాయి. 

`100% లవ్‌ మ్యాజిక్‌ రిపీట్‌..

`100 పెర్సెంట్ లవ్` తర్వాత మళ్ళీ గీత ఆర్ట్స్ లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఇది ఒక యాక్టర్ గా మంచి దారి చూపిస్తుందని భావిస్తున్నాను. గీత ఆర్ట్స్ లో మళ్ళీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. యాక్టర్ కి మంచి రిలీజ్ ఇస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ బావుంటుంది. ఈ కథ గీత ఆర్ట్స్ దగ్గర వుండటం నాకు డబుల్ బొనంజా. ఈ సినిమాతో మళ్లీ `100% లవ్‌` సినిమా మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు చైతూ.  

సాయిపల్లవితో బెస్ట్ ఎక్స్ పీరియెన్స్..

సాయిపల్లవి గురించి చెబుతూ, పల్లవి ఫెంటాస్టిక్ యాక్టర్. ఆమెతో యాక్ట్ చేయడం ఇష్టం. తనలో మంచి పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. క్యారెక్టర్ ని డీప్ గా అర్ధం చేసుకుంటుంది. ఒక ఆర్టిస్ట్ అలా వున్నప్పుడు మన పెర్ఫార్మెన్స్ కూడా ఎన్ హ్యాన్స్ అవుతుంది. సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలంటే కష్టపడాలి. అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. `శివుని సాంగ్ థీమ్ కూడా శివ పార్వతుల లవ్ స్టొరీ మీద వుంటుంది. మా క్యారెక్టర్స్ కూడా సినిమాలో శివ పార్వతుల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. అందుకే ఆ సాంగ్ ఆ థీమ్ లో పెట్టారు. 

`తండేల్‌`కి అవార్డులు..

అవార్డుల గురించి మాట్లాుతూ, `నేను అవార్డ్స్ గురించి ఇంకా అలోచించలేదు. అయితే అరవింద్  రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్ కి పంపిస్తానని అన్నారు. నేను అయితే అంత వరకు అలోచించలేదు. ఆడియన్స్ ని అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అని వెల్లడించారు నాగచైతన్య.  

read  more: 60 ఏళ్ల వయసులో 300కోట్ల కలెక్షన్లు రాబట్టిన సౌత్‌ హీరోలు ఎవరో తెలుసా? తెలుగులో ఒకే ఒక్కరు

also read: Trisha: అజిత్‌ సినిమాలో విలన్‌గా త్రిష?.. షాకిస్తున్న ప్రిడిక్షన్‌
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios