యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ...ఫ్యాన్స్ అధ్యక్ష్యుడుగా నాగచైతన్య కనిపించబోతున్నట్లు సమాచారం. అభిరామ్ నాగచైతన్య పేరు. ఈ విషయం ఇప్పటికే ప్రారంభమైన లొకేషన్ ద్వారా బయిటకు వచ్చింది. షూటింగ్ లో పోకిరి సినిమా బ్యానర్స్, ఓ థియోటర్స్ వద్ద కట్టి ఉన్నాయి. ఆ పోస్టర్స్ లో అభిరామ్ అనే పేరుతో ఉన్నాయి. బివియస్ రవి అందిస్తున్న ఈ కథలో చాలా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు సమాచారం.  ఈ సినిమాకు బివిఎస్ రవి స్క్రిప్టును అందించారు. అంతే కాకుండా ఆయనే ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నారు. 

అలాగే  ఈ సినిమాలో నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు చైతన్య. ఇక ‘థాంక్యూ’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. ఇక ‘థాంక్యూ’ సినిమాను శరవేగంగా షూట్ చేస్తున్నాడు విక్రమ్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమాలో ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇద్దరు డ్యాన్సర్ల జీవనవిధానాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమా చైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని తెలుస్తుంది.