శ్రీ విష్ణుతో రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సామజవరగమన మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ కలెక్షన్స్ డ్రాప్ కాలేదు. ఈ క్రమంలో  నాగ చైతన్య, రామ్ అబ్బరాజు  కాంబినేషన్ లో...


నాగచైతన్య నిజ జీవితంలో సమంతతో విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. చై, సామ్ విడిపోయి చాలా కాలం అయినా వారి విడాకులు విషయం ఇప్పటికీ హాట్ టాపిక్కే. ఆ టాపిక్ తోనే సినిమా చేస్తే ఎలా ఉంటుంది... సినిమాకు బోలెడు పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు నాగచైతన్య కూడా అలాంటి కథతో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. అతను తన తాజా చిత్రం విడాకులకు సంబంధించిన పాయింట్ చుట్టూ తిరుగుతుందని వినపడుతోంది. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే...

 రీసెంట్ గానే కస్టడీ మూవీతో డిసాస్టర్ అందుకున్న నాగ చైతన్య తన తదుపరి మూవీని చందు మొండేటితో చేస్తున్నారు. చందు మొండేటి నాగ చైతన్య కలయికలో తెరకెక్కబోయే చిత్రంపై అందరిలో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. తండేల్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం శ్రీకాకుళం నేపథ్యంలో ఉండబోతుంది అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంతో పాటుగా నాగ చైతన్య సామజవరగమన దర్శకుడితో కూడా కమిట్ అయినట్లుగా తెలుస్తుంది. 

రీసెంట్ గా శ్రీ విష్ణుతో రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సామజవరగమన మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ కలెక్షన్స్ డ్రాప్ కాలేదు. ఈ క్రమంలో నాగ చైతన్య, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో ఓ చిత్రం సెట్ అయ్యిందని సమాచారం. ఏషియన్ సినిమా వారు ఈ సినిమాని ప్రొడ్యూసర్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ విడాకుల నేపథ్యంలో ఉండబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఎంతవరకూ నిజం ఉందనేది మాత్రం తెలియదు. మరి నిజంగా విడాకుల నేపథ్యంలో సినిమా అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకుల్లోకి వెళుతుంది. కారణం నాగ చైతన్య వ్యక్తిగతంగా సమంతతో పెళ్లి, విడాకులతో బాగా హైలెట్ అవటమే కారణం. ఇప్పుడు అదే నేపథ్యంలో మూవీ అంటే ఖచ్చితంగా అందరిలో క్యూరియాసిటీ మొదలవుతుంది.