Asianet News TeluguAsianet News Telugu

నాగచైతన్య జోడీగా సాయి పల్లవి.. రిపీట్ కాబోతున్న క్రేజీ కాంబినేషన్..?

వెండితెరపై మరో క్రేజీ కాంబినేషన్ రిపిట్ కాబోతోంది. లవ్ స్టోరీతో సక్సెస్ ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంట మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. 
 

Naga Chaitanya Movie With Sai Pallavi Combination Once again JMS
Author
First Published Sep 17, 2023, 4:13 PM IST

చందూ ముండేటి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. పాన్‌ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ  సినిమా కోసం నాగ చైతన్య కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు.ప్రత్యేకించి చేపలు పట్టే  జాలర్లుతో  ట్రావెలింగ్ చేయడం, వారితో మాట్లాడటం, వారితో కలిసి చేపలు పట్టడం.. తినడం, అక్కడే నిద్రపోవడం.. ఓ పరిశోధనలా చేస్తున్నాడు చైతూ.. వాళ్ల డేయిల్‌ యాక్టివిటీస్‌ను తెలుసుకోవడం, బోట్‌ శిక్షణ వంటివి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనుంది. 

ఇక ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లోనే  భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో అంతా చూస్తున్నట్టుగానే నాగ చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవిని తీసుకున్నట్టు టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపస్తుంది.  ఇప్పటికే  ఈ కథా ను ఆమెకు వినిపించడం జరిగిందట. అయితే ఇంత వరకూ సాయి పల్లవి ఎటువంటి నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథా బలం ఉన్నది కావడం.. హీరోయిన్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఉండటంతో.. సాయి పల్లవి తప్పకుండా ఒప్పుకుంటుంది అన్న నమ్మకంతో ఉన్నారట 

ఆమె గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడమే లేటని సమాచారం. ఇప్పటికే వీళ్ల కాంబోలో వచ్చిన లవ్‌స్టోరీ సూపర్‌ డూపర్‌ హిట్టయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వీళ్ల కెమెస్ట్రీ అద్భతంగా కుదిరింది. దాంతో ఇదే జోడీని మళ్లీ రిపీట్ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే చాన్స్‌ ఉంది. ఇక ఈసినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌  పాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని  అందించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. 

. ఇక ఈ సినిమా మొత్తం జాలరుల చుట్టూ తిరుగుతుందట. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్‌ వెళ్లి అక్కడ అనుకోకుండా ఓ సంఘటనలో చిక్కుకుంటారు. మరీ దాంట్లోనుంచి వాళ్లు బయటకు వచ్చారా? తిరిగి వాళ్ల కుటుంబాలను కలుసుకున్నారా అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా యధార్థ సంఘటనల ఆధారంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్స్ పెర్మెంట్ చేస్తున్న నాగచైతన్య.. ఈ దెబ్బతో.. సాలిడ్ హిట్ కొట్టి.. తనను తాను ప్రూ చేసుకోవాలి అని చూస్తున్నాడు. .

Follow Us:
Download App:
  • android
  • ios