Asianet News TeluguAsianet News Telugu

అక్కినేని-దగ్గుబాటి కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన సమంత... నాగ చైతన్యకు తల్లి లక్ష్మి దూరం?


దగ్గుబాటి-అక్కినేని కుటుంబాల మధ్య దూరం పెరిగింది అంటూ జాతీయ మీడియాలో వచ్చిన ఓ వార్త సంచలనం రేపుతోంది. ఈ కథనం ప్రకారం నాగ చైతన్యకు తల్లి దగ్గుబాటి లక్ష్మి దూరమైందట.. 
 

naga chaitanya mother daggubati lakshmi not happy for divorce with samantha ksr
Author
First Published Aug 24, 2024, 7:18 AM IST | Last Updated Aug 24, 2024, 7:18 AM IST

హీరో నాగ చైతన్య మరో వివాహం చేసుకోబోతున్నాడు. ఆగస్టు 8న తన గర్ల్ ఫ్రెండ్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా ధృవీకరించారు. నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొత్త కోడలు శోభిత ధూళిపాళ్లకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. నాగ చైతన్య-శోభిత లను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు.

నాగ చైతన్య నిశ్చితార్థం వేడుక చాలా నిరాడంబరంగా జరిగింది. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. కాగా ఈ వేడుకకు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాలేదు. నాగ చైతన్య రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మి కొడుకు అన్న విషయం తెలిసిందే. నాగార్జునతో విడిపోయిన లక్ష్మి అమెరికాలో సెటిల్ అయ్యింది. నాగ చైతన్య బాల్యంలో తల్లి వద్దే పెరిగాడు. హీరోగా మాత్రం నాగార్జున లాంచ్ చేశాడు. 

కొడుకు నిశ్చితార్థం వేడుకకు తల్లి లక్ష్మి రాకపోవడం వెనుక బలమైన కారణమే ఉందని జాతీయ మీడియా కథనం. సమంతతో నాగ చైతన్య విడిపోవడం దగ్గుబాటి లక్ష్మికి అసలు ఇష్టం లేదట. సమంతను కోడలిగా ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించిందట. విడాకుల విషయంలో నాగ చైతన్యదే తప్పు అని దగ్గుబాటి లక్ష్మి భావిస్తున్నారట. సమంతకు దూరమైన నాగ చైతన్యతో తల్లి గతంలో మాదిరి అన్యోన్యంగా ఉండటం లేదట. 

నాగ చైతన్య-దగ్గుబాటి లక్ష్మి పెద్దగా మాట్లాడుకోవడం లేదట. నాగ చైతన్య మీద ఆమె కోపంగా ఉన్నారట. అదే సమయంలో సమంతతో దగ్గుబాటి లక్ష్మి టచ్ లో ఉన్నారట. సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసి దగ్గుబాటి లక్ష్మి చాలా వేదనకు గురైందట. సమంతతో తరచుగా ఆమె మాట్లాడుతూ ఉంటుందట. సమంత యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనం సారాంశం. 

నాగ చైతన్య పెళ్ళికి కూడా ఆమె వచ్చే అవకాశం లేదంటున్నారు. సమంతతో విడాకుల పరిణామం దగ్గుబాటి-అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియదు. ఈ నేపథ్యంలో అసలు నాగ చైతన్యతో సమంతకు మనస్పర్థలు రావడానికి శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ నే కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు 2025 ఫిబ్రవరి లేదా మార్చ్ లో నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయట. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios