మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజాని కలిశారు హీరో నాగచైతన్య. ఈ సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. తన అభిమానాన్ని చాటుకున్నారు. 

మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత రంగంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. సౌత్‌ సినిమా సంగీతానికి ఆయన బ్యాక్‌ బోన్‌లా వ్యవహరించారని చెప్పొచ్చు. అంతేకాదు అనేక క్లాసికల్‌ మూవీస్‌కి సంగీత పరంగా ముఖ్య భూమిక పోషించారు. చాలా వరకు ఆయన సంగీతంతోనే హిట్‌ అయిన సినిమాలు కూడా ఉండటం విశేషం. ఆయన సంగీతం అంటే నచ్చని వాళ్లుండరు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

యంగ్‌ హీరో నాగచైతన్యకి కూడా ఆయన సంగీతం అంటే ఇష్టం. ఇంకా చెప్పాలంటే ఇళయరాజా సంగీతానికి ఆయన పెద్ద ఫ్యాన్. తన ఎదుగుదలతో ఇళయరాజా పాటలు ట్రావెల్‌ చేశాయట. తన నుంచి ఆయన పాటలను వేరు చేయలేమని చెబుతున్నారు. తాజాగా నాగచైతన్య.. ఇళయరాజాని కలిశారు. హైదరాబాద్‌కి వచ్చిన మ్యాస్ట్రోని ఆయన ప్రత్యేకంగా కలిసి తన ఫ్యాన్‌ బాయ్‌ మూవ్‌మెంట్‌ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చైతూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఎమోషనల్‌ నోట్‌ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

ఇందులో చైతూ చెబుతూ, `మ్యాస్ట్రో ఇళయరాజా సర్‌ని కలిసినప్పుడు నా మొహంలో ఇంత పెద్ద చిరునవ్వు. ఆయన కంపోజిషన్లు నా జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేశాయి. చాలా సార్లు నా మైండ్‌లో ఆయా సీన్లు మెదులాడుతూనే ఉంటాయి. ఆయన రిఫరెన్స్ తో స్క్రిప్ట్ ని చిత్రీకరించాను. ఇప్పుడు `కస్టడీ` సినిమా కోసం రాజా సర్‌ కంపోజ్‌ చేస్తున్నారు. నిజంగా ఆయనకు కృతజ్ఞతలు` అని వెల్లడించారు చైతూ. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోని పంచుకున్నారు. 

Scroll to load tweet…

ఇళయరాజా ఈ రోజు(శనివారం) సాయంత్రం నుంచి హైదరాబాద్‌ మ్యూజిక్‌ లైవ్‌కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌, నాగార్జున వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య `కస్టడీ` చిత్రంలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న బైలింగ్వర్‌ చిత్రమిది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. `బంగార్రాజు` తర్వాత మరోసారి ఈ జోడీ రిపీట్‌ అవుతుంది. ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం పూర్తయిన విషయం తెలిసిందే. మే 12న సినిమాని విడుదల చేయబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది.