అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు శివ నిర్వాణ 'మజిలీ' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. పెళ్లైన తరువాత మొదటిసారి సమంత, చైతు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

సంక్రాంతి కానుకగా సినిమాకి సంబంధించి మరో పోస్టర్ ని వదిలింది  చిత్రబృందం. ఇందులో నాగ చైతన్య క్రికెటర్ గా కనిపిస్తుండగా.. మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చైతుని కౌగిలించుకొని కనబడింది.

నిజానికి ఈ సినిమా కథ పెళ్లైన జంట మధ్య వచ్చే పొరపచ్చాల నేపధ్యంలో సాగుతుంది. ఈ పోస్టర్ ని బట్టి పెళ్లికి ముందు హీరో మరో అమ్మాయితో నడిపిన ప్రేమాయణాన్ని కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 5నప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో అయినా చైతు సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!