Asianet News TeluguAsianet News Telugu

''లవ్ స్టొరీ'' లో ఆ వివాదాస్పద డైలాగు, తీసేసారా?

టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాల్లో లవ్ స్టోరీ ఒకటి.  ఫిదా లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల నుంచి వస్తున్న మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్‌24న ప్రేక్షకల ముందుకు వచ్చింది.

Naga Chaitanya, Love story Gorrela Controversial dialogue missing
Author
Hyderabad, First Published Sep 24, 2021, 9:11 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సాధరణంగా శేఖర్ కమ్ముల.. మొదటి నుంచీ వివాదాల జోలికి రాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.  అయితే.. చిత్రంగా ఆయన లవ్ స్టోరీ మూవీ  వరుస వివాదాలకి కారణం అయ్యింది. మొదట్లో “సారంగ దరియా” పాట చుట్టూ భారి చర్చ, రచ్చ జరిగింది. ఆ తర్వాత..  ట్రైలర్ విడుదల అయ్యాక కూడా లవ్ స్టోరీ సినిమా పై కొత్త వివాదం మొదలైంది.  గొర్రెల పంపిణీ డైలాగ్ విషయమై సెటైర్స్ వేసారని చాలా మంది మండిపడ్డారు. మరి ఆ డైలాగు సినిమాలో ఉందా..రెస్పాన్స్ ఏమిటో చూద్దాం
 
లవ్ స్టోరీ ట్రైలర్ చూస్తే..   తెలంగాణ యాసలో హీరో క్యారెక్టర్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ వివాదానికి కారణం అయ్యింది. లవ్ స్టోరీ ట్రైలర్ లో హీరో లోన్ కోసం ప్రయత్నం చేసే చిన్న సీన్ ఉంది. హీరో బ్యాంకుకు వెళ్లిన సమయంలో గొర్రెలోడికి గొర్రెలిస్తే వాడు గొర్రెలనే మేపుతాడు.. రిక్షావాడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షానే తొక్కుతాడు అంటూ ఓ డైలాగ్ చెప్పాడు.  ఈ డైలాగ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం గతంలో ప్రజలకి గొర్రెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు.. లవ్ స్టోరీ మూవీలో శేఖర్ కమ్ముల ఈ డైలాగ్స్ వాడటంతో కొందరికి కోపం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళూ సర్కార్ పథకాల పై సెటర్స్ వేసేవాళ్ళే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. ఈ విషయం శేఖర్ కమ్ముల దాకా వెళ్లినట్లుంది. అనవసర వివాదాలు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఆ డైలాగు మాత్రం సినిమాలో లేదు. దాన్ని తీసేసారు. 

ఇక ఈ రోజు విడుదల అయ్యిన లవ్ స్టోరీ మూవీ కు మిక్సెడ్ టాక్ వస్తోంది. లవ్‌స్టోరీ సినిమా పాటలు, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కులం, పరువు హత్య లాంటి సెన్సిటివ్‌ అంశాలను తెరపై ఎలా చూపించారన్నది చాలామందిలో ఉన్న క్యూరియాసిటీ తో ఓపినింగ్స్ అద్బుతంగా వచ్చాయి. అడ్వాన్స్ బుక్కింగ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. చివరి అరగంట డార్క్ గా ఉందని అంటున్నారు. అది కనుక జనం ఏక్సెప్టు చేస్తే పెద్ద హిట్ అనేది ట్రేడ్ మాట. చూడాలి ఏం జరగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios