Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి పెళ్లి కూతురుకి చిన్న సాయం చేసిన నాగ చైతన్య.. అవికా గోర్ హ్యాపీ

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

Naga Chaitanya launches Madhi Vihangamayye Lyrical Song
Author
First Published Jan 18, 2023, 4:06 PM IST

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ చిత్రాలు అవికా గోర్ ఖాతాలో పడిపోయాయి. కానీ ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేదు. ప్రస్తుతం అవికా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూవీస్ పై అవికా చాలానే హోప్స్ పెట్టుకుని ఉంది.

ప్రస్తుతం అవికా గోర్ నటిస్తున్న చిత్రం పాప్ కార్న్. ఈ చిత్రంలో అవికా యువ నటుడు సాయి రోనక్ తో జంటగా నటిస్తోంది. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా బుధ‌వారం రోజున ‘మ‌ది విహంగ‌మ‌య్యే...’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. 

ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ నాగ చైతన్య చేతుల మీదుగా లాంచ్ కావడం విశేషం. వినసొంపుగా ఉన్న ఈ పాటకి శ్రీజో సాహిత్యం అందించగా.. బన్నీ దయాల్, రమ్య బెహ్రా గాత్రం అందించారు. 

అవికా గోర్ కి ఇటీవల సరైన సక్సెస్ లేదు. మరి ఈ చిత్రంతో అవికా గోర్ విజయం అందుకుంటుందేమో చూడాలి. ఇక అవికా గోర్ సోషల్ మీడియాలో గ్లామర్ తో ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. చైతు ఈ సాంగ్ లాంచ్ చేయడంతో అవికా అతడికి సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పింది.  

Follow Us:
Download App:
  • android
  • ios