`స్పై` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నాగచైతన్య గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా నిఖిల్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన జర్నీ ఇన్‌స్పైరింగ్‌గా సాగిందన్నారు. హీరోగా నిఖిల్ అంటే చాలా ఇష్టమని తెలిపారు.
నిఖిల్ హీరోగా నటించిన చిత్రం `స్పై`. ఐశ్వర్య మీనన్, సానియా కథానాయికలుగా నటించారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని రూపొందించారు. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా, ఆయన మిస్టరీ అంశంతో ఈ `స్పై` చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 29న ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి హీరో నాగచైతన్య గెస్ట్ గా వచ్చారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, నిఖిల్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన జర్నీ ఇన్‌స్పైరింగ్‌గా సాగిందన్నారు. హీరోగా నిఖిల్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ``హ్యాపీడేస్` చిత్రంలో బాయ్‌నెక్ట్స్ డోర్ క్యారెక్టర్ చేసి, ఆ తర్వాత `స్వామిరారా`, `కార్తికేయ` చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నారు. ట్రెండ్ సెట్ చేశాడు. `కార్తికేయ 2`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇండియా వైడ్‌గా షేక్ చేశాడు. అతనిది ఇన్‌స్పైరింగ్ జర్నీ. అందుకు నిఖిల్‌కి అభినందనలు తెలియజేస్తున్నా. స్పై థ్రిల్లర్ జోనర్ సినిమాలు తీయడం ఈజీ కాదు, చాలా పెద్ద ఛాలెంజ్. ఓటీటీలు వచ్చాక హాలీవుడ్ స్పై థ్రిల్లర్లు చూస్తున్నారు మన ఆడియెన్స్. వారికి నచ్చాలంటే చాలా కష్టం. కానీ ఈ `స్పై` ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. కచ్చితంగా హిట్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది.
నిఖిల్.. `కార్తికేయ2`తో ఎలా అయితే ట్రెండ్ సెట్ చేశాడు. ఈ సినిమాతో దాన్ని దాటి నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాడని నమ్ముతున్నా, కోరుకుంటున్నా. అలాగే ఇంట్లో బోర్ కొట్టినప్పుడు. అభినవ్ గోమటం నటించిన `ఈ నగరానికి ఏమైంది` సినిమా చూస్తాను. ఆయన కామెడీ అద్భుతంగా ఉంటుంది, ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా` అని తెలిపారు నాగచైతన్య. ఈ సందర్భంగా సినిమాలో నటించిన హీరోయిన్లు ఐశ్వర్య మీనన్, సానియా, కీలక నటులు అర్యన్ రాజేష్, నితిన్, రిషి, చిత్ర నిర్మాతలకు నాగచైతన్య అభినందనలు తెలిపారు. చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ, నాగచైతన్య ఈ ఫంక్షన్ కి వస్తాడని తాను నమ్మలేదని, అందుకు చాలా హ్యాపీగా ఉందని, ఇప్పటి వరకు `స్పై` సినిమాకి సంబంధించిన రకరకాల ఫీలింగ్ ఉండేది, కానీ చైతన్య రావడంతో అవన్నీ పోయాయి, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఓ పాజిటివ్ ఆరా ఆవహించినట్టుంది. చాలా సంతోంగా ఉందని చెప్పారు. నాగచైతన్య చాలా గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తి కూడా. ఆయన ఈ మా ఫంక్షన్‌కి రావడమే అందుకు ఉదాహరణ. ఈ సందర్భంగా నాగచైతన్యనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను` అని చెప్పారు నిఖిల్.
`స్పై`సినిమా గురించి చెబుతూ, సుభాష్ చంద్రబోస్ మిస్టరీ నేపథ్యంలో ఇండియన్స్ గర్వపడే కథతో సినిమా చేశామని, ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రమని తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, నాలుగు రోజుల క్రితం సినిమా చూసినప్పుడు దర్శకుడు గ్యారీని హగ్ చేసుకుని ఆయనకు థ్యాంక్స్ చెప్పానని, అంత బాగా ఉందన్నారు. అలాగే ఆ సినిమా చూశాక తనకు క్లాప్స్ కొట్టాలనిపించిందని, స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాలనిపించిందన్నారు. రేపు థియేటర్‌లో సినిమాని చూసిన ఆడియెన్స్ సైతం అదే ఫీలవుతారని, అంత బాగా వచ్చిందన్నారు నిఖిల్.
