ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 21 నుండి "శ్యామ్ సింగరాయ్" చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా సినిమా గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకుంది. 

 "టక్ జగదీష్" సినిమాతో ఫ్లాప్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం "శ్యామ్ సింగరాయ్" . ఈ సినిమాతో నాని భారీ విజయాన్ని అందుకున్నాడు. "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకి "టాక్సీవాలా" ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల అయింది.

మొదటి రోజునుండి మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. థియేటర్ లలో ఉన్నప్పుడు చాలా సార్లు హౌస్ ఫుల్ బోర్డ్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం లో కూడా అదే జోరు కనబరుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 21 నుండి "శ్యామ్ సింగరాయ్" చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా సినిమా గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకుంది. దాంతో ఈ దర్శకుడుకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ దర్శకుడు తదుపరి ఏ హీరోతో చెయ్యబోతున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.

మీడియా వర్గాల నుంచి అందుతన్న సమాచారం మేరకు ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయబోతున్నారు. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య మాస్కోలో ఉన్నారు. అక్కడ నుంచి రాగానే ఈ సినిమా గురించి డిస్కషన్స్ మొదలవుతాయి. ఈ చిత్రం టైమ్ ట్రావలింగ్ నేపధ్యంలో సాగనుందని సమాచారం. ఈ మేరకు స్క్రిప్టు వర్కు జరుగుతోంది.అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరంలోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.