Asianet News TeluguAsianet News Telugu

బరువు తగ్గుతున్న నాగచైతన్య..ఆసినిమా కోసమేనట, ఎంత తగ్గబోతున్నాడంటే..?

పాత్రలకోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడటం లేదు ప్రస్తుతం ఉన్న హీరోలు. తామేంటో.. తమ సత్తా ఏంటో నిరూపించుకోవడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా ఇలానే ఓ ప్రయోగానికి రెడీ అయ్యాడు. 
 

Naga Chaitanya Experiment In NC23 Movie Directed by Chandoo Mondeti JMS
Author
First Published Oct 28, 2023, 1:31 PM IST

పాత్రలకోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడటం లేదు ప్రస్తుతం ఉన్న హీరోలు. తామేంటో.. తమ సత్తా ఏంటో నిరూపించుకోవడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా ఇలానే ఓ ప్రయోగానికి రెడీ అయ్యాడు. 

హీరో నాగచైతన్య  తన నెక్ట్స్ సినిమా కోసం బిజీ అయ్యాడు. ఈసారి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు చైతూ. ప్రాక్టికల్ గా తన పాత్ర కోసం బాగా గ్రౌండ్ వర్క్ చేశాడు. అందుకోసం చాలా టైమ్ తీసుకుని.. కావల్సిన ఫీడ్ బ్యాక్ ను తానే స్వయంగా తీసుకున్నాడు. ఎన్నో ఊర్లు తిరిగి.. తన పాత్రకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్.. పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేశాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. 

ఇక గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై  భారీ బడ్జెట్ తో ఈసినిమాను  నిర్మిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈమూవీ NC23 వర్కింట్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోబోతున్నారు. అయితే నాగచైతన్య.. బాగా ప్రాక్టీస్ చేసిన పాత్ర ఇదే.. మత్స్యకారుల పాత్ర. ఇక ఈసినిమాలో మొదట హీరో ఎలా ఉన్నా.. పాకిస్థానీలకు చిక్కిన తరువాత చిక్కి శల్యమైపోవాలసిందే. అదే పాత్రకోసం..రియాల్టీకి దగ్గరగా ఉంటుందని బరువు తగ్గబోతున్నారట చైతూ. 

ఈ సినమాలో  పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు నాగచైతన్య. ఆక్యారెక్టర్  కోసం బరువు కూడా తగ్గుతున్నారట చైతు. ఇందులో చైతు మేకోవర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేస్తుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నాగ చైతన్య కూడా యాక్టివ్ గా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీమత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్యలేశం గ్రామాన్ని ఆయన గతంలో సందర్శించిన సంగతి తెలిసిందే.

మత్స్యకారుల జీవన స్థితిగతులు, వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానం, ఇబ్బందులు, వ్యవహార శైలి, యాస, భాష స్వయంగా తెలుసుకొనేందుకు ఆ గ్రామానికి వెళ్ళారు చైతు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. చైతన్య లుక్ ప్రస్తుతం కాస్త డిఫరెంట్ గానే ఉంది. రీసెంట్ గా జరిగిన వెంకటేష్ కూతురు నిశ్చితార్ధంలో కూడా చైతూ వెరైటీగా కనిపించాడు. తాజాగా ఈమూవీకి సబంధించిన చిన్న వర్క్ షాప్ లో కూడా చైతూ లుక్ సరికొత్తగా అనిపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios