Asianet News TeluguAsianet News Telugu

ఏఎన్ఆర్ మనవడిగా పుట్టడం నా అదృష్టం.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్..

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి జయంతి ఉత్సవాల్లో ఆయన మనవడు నాగచైతన్య భావోద్వేగమయ్యారు.  ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 
 

Naga Chaitanya Emotional Speech to ANR 100 Years Birthday Celebration NSK
Author
First Published Sep 20, 2023, 1:09 PM IST

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR)  శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు  ముఖ్య అతిథిగా హాజరై ఏఎన్నార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలతో నివాళి అర్పించారు. నాగేశ్వరరావు ఘనతను గుర్తుచేశారు. ఈ సందర్భంగా నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ ఎమోషనల్‌ అయ్యారు. చైతూ, అఖిల్ వేడుకకు వచ్చిన వారిని దగ్గరుండి మరీ రిసీవ్ చేసుకున్నారు.

ఈ ఉత్సవాల్లో టాలీవుడ్ ప్రముఖులు మోహన్ బాబు, బ్రహ్మానందం, జయసుధ, జగపతి బాబు, మహేశ్ బాబు, రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తదితరులు హాజరయ్యారు. ఒక్కొక్కరు ఎన్నార్ తో ఉన్న బంధం, మెమోరీస్ ను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ మనవడు అక్కినేని నాగ చైతన్య (AKkineni Naga Chaitanya)  తాత గురించి భావోద్వేగమైన స్పీచ్ ఇచ్చారు. నాగేశ్వరరావును గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 

చైతూ మాట్లాడుతూ.. ఏన్నార్ గారి అంటే అందరికీ తెలుగు ఇందస్ట్రీ పెద్దగా, గొప్ప నటుడిగా, క్లాసిక్ ఐకానిక్ గా సుపరిచయం. ఆయన చేసిన చిత్రాలు, కొత్త జానర్లలో చేసిన రిస్కులు ఎనలేనివి. ఇప్పటికీ ఫిల్మ్ స్కూల్ ఏఎన్నార్ ను ఇన్పైరింగ్ కేస్ స్టడీగా చదువుతుంటారు. నేను కూడా ఆ లిస్టులో ఒకడిని. ‘మనం’ సినిమా తాతగారితో కలిసి చేయడం నా అద‌ృష్టం. అది నా లైఫ్ లో, కెరీర్ లో హైపాయింట్. ఆయన ఎప్పుడూ నాలో దీపంలా వెలుగుతూనే ఉంటారు. ఈ వేడుకకు వచ్చిన అక్కినేని అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఎక్కడ పుడుతామో.. ఎవరి పుడుతామో మన చేతిలో ఉండదు. అక్కినేని నాగేశ్వర్ రావు గారి మనవడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన లెగసీ అదేస్థాయిలో కొనసాగుతుంది. ఆయన మనలోనే జీవించి ఉన్నారు.’ అని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం చైతూ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. హృదయం కదిలించేలా మాట్లాడి ఏఎన్నార్ పై తనకున్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇక చైతూ రీసెంట్ గా ‘కస్టడీ’ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న NC23లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో మూవీ సెట్స్  మీదకు వెళ్లనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios