టాలీవుడ్ లో మల్టీస్టారర్ ల హడావుడి రోజురోజుకి తారా స్థాయికి చేరుకుంటోంది. కథ నచ్చితే చాలు స్టార్స్ ఏ మాత్రం నో చెప్పకుండా తోటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా అక్కినేని మల్టీస్టారర్ సినిమాలుమాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ప్రస్తుతం నాగ చైతన్య తన మామయ్యతో వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  

అయితే ఆ సినిమా అయిపోయిన తరువాత నాగ చైతన్య బంగార్రాజు కథను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. నాగార్జున కూడా ఆ సినిమాలో కొడుకుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అయితే  కథకు తగ్గట్టుగా చైతు ఫిట్ నెస్ లో కొన్ని మార్పులు చేయబోతున్నాడట. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఒకదానికొకటి సంబంధం లేకుండా  రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించిననున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో దర్శకుడు థ్రిల్లింగ్ అనిపించే ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసుకున్నట్లు టాక్.

సినిమాలో భయపెట్టే సీన్స్ కూడా ఉంటాయని ఆ సన్నివేశాల్లో చైతూ నటన అద్భుతంగా ఉంటుందని సమాచారం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ అక్కినేని మల్టీస్టారర్ వారి సొంత ప్రొడక్షన్ అయిన అన్నపూర్ణ బ్యానర్ లోనే నిర్మించనున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు.