హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ని సొంతం చేసుకున్న నాగ చైతన్య.. రేసింగ్ టీమ్ కి ఓనర్ గా అక్కినేని హీరో
అక్కినేని నాగ చైతన్య త్వరలో చందు ముండేటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చైతు తన కెరీర్ లోనే వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

అక్కినేని నాగ చైతన్య త్వరలో చందు ముండేటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చైతు తన కెరీర్ లోనే వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సముద్రంలో చేపల వేట సాగించే జాలరి పాత్రలో చైతు నటించబోతున్నట్లు తెలుస్తోంది.
చైతు కోసం చందు ముండేటి ఎంతో ఆసక్తికరమైన స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇప్పటికే చైతు ఈ చిత్రం కోసం స్వయంగా సముద్రంలో బోట్ నడిపే మత్స్యకారులని కలసి వారి అనుభవాలని తెలుసుకున్నారు. ఇదిలా ఉండాగా నాగ చైతన్యకి కార్లు, రేసింగ్ అంటే కూడా పిచ్చి.
ఇండియాలో ఫెరారీ కారు సొంతం చేసుకున్న అతి కొద్దిమంది సెలెబ్రెటీల్లో నాగ చైతన్య ఒకరు. అయితే తాజాగా నాగ చైతన్య అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తూ ఏకంగా ఫార్ములా 1 రేసింగ్ టీమ్ ని కొనుగోలు చేశాడు. ఫార్ములా 1 లీగ్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీం ని చైతు సొంతం చేసుకున్నాడు. ఈ టీమ్ కి చైతు ఓనర్ అయ్యాడు.
దీని గురించి నాగ చైతన్య స్పందిస్తూ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇష్టమైన వాటిలో ఫార్ములా వన్ రేసింగ్ కూడా ఒకటి. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీం ఈ ఏడాది ఫార్ములా 4 రేసింగ్ ఛాంపియన్ షిప్ లో భాగం కాబోతోంది. నాగ చైతన్యకి వెల్కమ్ చెబుతూ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీం క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు.