రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణాలలో ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లకు క్యూ కడుతున్నారు ప్రజలు. 
సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున వంటి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. తాజాగా నాగచైతన్య, సమంతలు కలిసి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి చెరుకున్నారు. తమ ఓటు హక్కుని వినియోగించుకున్న ఈ జంట అభిమానులను కూడా ఓటు వేయాలని పిలుపినిచ్చారు. 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.