కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమా చేయడానికి అక్కినేని వారసులు ముందుంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాగార్జున - నాగ చైతన్య ఇప్పటికే ఆ ప్రయోగాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నెక్స్ట్ అఖిల్ కూడా మల్టీస్టారర్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

అది కూడా అన్నయ్య నాగ చైతన్యతోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ వి.ఆనంద్ ప్రసాద్ ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం  తెలిసిందే. అయితే ఆ కథ మల్టీస్టారర్ అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టాలని నిర్మాత అడుగులు వేస్తున్నారు. ఇక సినిమాలో ఇప్పటికే నాగ చైతన్యను ఫైనల్ చేయగా మరో హీరోగా అఖిల్ అయితే బెస్ట్ అని దర్శకుడు నిర్ణయం తీసుకున్నట్లు టాక్. 

అయితే ఈ ప్రాజెక్ట్ కి నాగార్జున ఇంకా ఒప్పుకోలేదట. అఖిల్ తో ఇప్పుడే మల్టీస్టారర్ రిస్క్ చేయించకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కథను చూసి మరోసారి ఆలోచించాలని ఆనంద్ ప్రసాద్ నాగ్ కి సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నాగ చైతన్య వెంకీ మామ సినిమాతో బిజీగా ఉండగా అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో వర్క్ చేస్తున్నాడు.