యుఎస్ రివ్యూలు అయితే చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి. వాటి వల్ల కొన్ని సార్లు మేలు,మరికొన్ని సార్లు కీడు జరుగుతోంది. ఈ విషయమై నాగచైతన్య రియాక్షన్ ఏమిటంటే..


ఎవరు ఒప్పుకున్నా ...ఒప్పుకోకపోయినా ఇవాళ డిజిటల్ యుగంలో రివ్యూలు చాలా త్వరగా వచ్చేస్తున్నాయి.యుఎస్ రివ్యూలు అయితే చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి. వాటి వల్ల కొన్ని సార్లు మేలు,మరికొన్ని సార్లు కీడు జరుగుతోంది. ఓపినింగ్స్ కు మార్నింగ్ వచ్చే రివ్యులూ ఉపయోగపడుతున్నాయి. సినిమా సూపర్ హిట్ అనే టాక్ కనుక మార్నింగ్ స్ప్రెడ్ అయితే ఖచ్చితంగా ఆ రోజే చూడాలనుకునే వారు,వెంటనే బుక్ మై షోనో మరొక యాప్ లోనే బుక్ చేసుకుంటున్నారు. అలాగే సినిమా వరస్ట్ గా ఉందని తెలిస్తే..టిక్కెట్ కాన్సిల్ చేసుకునేవారు ఉన్నారు. ఇలా రివ్యూలు చాలా సార్లు ప్రామాణికం కాకపోయినా ఇన్ఫూలియన్స్ అయితే చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రివ్యూలు రిలీజైన మూడు రోజులు తర్వాత రావాలనే వారు ఉన్నారు. మరికొందరు రివ్యూలు లైట్ అనే హీరోలు ఉన్నారు. మరి నాగచైతన్య ఏమంటున్నారు. తన తాజా చిత్రం కష్టడీ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ ఈ విషయమై స్పందించారు.

నాగచైతన్య మాట్లాడుతూ... నిద్రలేచే సమయానికి రివ్యూలు వచ్చేస్తున్నాయి. అలాంటి యుగంలో ఉన్నాము. మా ప్రయారిటీ ఏమిటంటే ఓపినింగ్స్ రావాలి. వీకెండ్స్ లో సినిమా కలెక్షన్స్ మాగ్జిమం లాగాలి. నిర్మాత సేఫ్ అవ్వాలి. దాంతో ప్రమోషన్ స్ట్రాటజీ మారిపోయింది. అందరి ఒపినియన్స్,పల్స్ మొత్తం సోషల్ మీడియాలో కనపడుతోంది. అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ త్రో అవుతోంది. ఆ విషయంలో ఎవర్నెస్ గా ఉండాలి. టాక్సిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మనకు ఏది కావాలో ..ఏది వద్దో అది పిల్టర్ చేసి తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. అంత ప్రొద్దున్నే వచ్చే రివ్యూలు మీద మాకేమీ కోపం ఉండదు. అది సినిమా బిజినెస్ లో భాగం. అందులో తప్పేమి లేదు. అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా అన్నారు.

ఇక నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. బంగార్రాజు వంటి హిట్ మూవీ అనంతరం వీరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది. ఇందులో అరవింద్ స్వామి విలన్ గా చేశారు. అలాగే ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. సినిమాలో ఆఖరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అని.. క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి కలిగించేలా ఈ చిత్రం వచ్చిందని.. కచ్చితంగా కస్టడీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని వినిపిస్తోంది.మరి ఈ టాక్ కి తగ్గట్టుగా సినిమా ఉంటుందో..? లేదో..? తెలియాలంటే రేపు రిలీజ్ దాకా వేచి చూడాల్సిందే.