హీరో జగపతిబాబు పదేళ్ల క్రితం రూటు మార్చి విలన్ గా మారి...ఫుల్ బిజీ అయ్యారు.  నందమూరి బాలకృష్ణ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించారు . ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ,అరవింత సమేత చిత్రంలోనూ జగపతి సీరియస్ విలనీతో మెప్పించారు. ఇప్పుడు నాగబాబు సైతం అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. రీసెంట్ గా ఆయన కొత్త లుక్,గెటప్ తో ఫొటో షూట్ చేయించుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ లుక్ ఇప్పుడు ఏ సినిమా కోసమో రివీల్ అయ్యింది. 

అందుతున్న సమాచారం ప్రకారం... నాగబాబు త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో బ్లక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ప్రభాస్‌ చిత్రం ఛత్రపతి మూవీని యంగ్‌ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా హిందీలో రిమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగబాబు విలన్‌ పాత్ర పొషిస్తున్నట్లు సమాచారం.  హిందీలో రిమేక్‌ కానున్న ఛత్రపతి మూవీలో నాగబాబు విలన్‌గా నటిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రంలో చాలా మందిని  విలన్ పాత్రకు కోసం కోసం చూసి, చివరకు చిత్ర టీమ్  ఆయనను సంప్రదించారని, ఈ పాత్ర చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై చిత్రయూనిట్‌ అధికారిక ప్రకటన వెలువరించనుందట. 

 వాస్తవానికి నాగబాబు గతంలో  చిరంజీవి సినిమాల్లో కీలక పాత్రలు వేయడమే కాకుండా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో మెప్పించారు. ఆయన హీరోగా వచ్చిన సినిమాలు వర్కవుట్ కాలేదు. దాంతో బుల్లితెరమీద కూడా సత్తా చాటారు.  ప్రముఖ కామెడీ షో జబర్థస్త్‌ కార్యక్రమం షోకు ఆయన జడ్జిగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగబాబు ఇప్పుడా షో నుంచి బయిటకు వచ్చేసారు. సోషల్ మీడియాలో మెగాబ్రదర్ యాక్టివ్ గా ఉండే ఆయన, యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. అంతేగాక అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా మారారు. ఇప్పుడీ విలన్ లుక్ తో మళ్లీ నాగబాబు ఫుల్ బిజీ అవుతారని అందరూ భావిస్తున్నారు.