ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటున్న నాగబాబు ఇప్పుడు తన తప్పు ఒప్పుకుంటూ ఆశ్చర్యపరిచారు. గత కొద్ది రోజులుగా మన ఛానల్ మన ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. దాని ద్వారా అనేక విషయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా  నాగబాబు తాజాగా పిల్లల పెంపకం విషయం గురించి మట్లాడుతూ తనో తప్పు చేసానని అన్నారు. ఆయన మాటల్లోనే.... నేను గొప్ప కమ్యూనికేటర్ కాకపోవచ్చు కానీ.. ఎంతో కొంత బెటర్. నా పిల్లలైనా వరుణ్ , నిహారికలకు చాలా విషయాలను విడమరిచి చెప్పేవాడిని. చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పాలి, కానీ కొట్టకూడదు. నేను ఒకటి రెండుసార్లు నిహారిక, వరుణ్ లని కొట్టాను.

కానీ అది చాలా తప్పు. అప్పటికి నాకు మెచ్యూరిటీ లేదు. అందుకే ఆలా ప్రవర్తించేవాడిని. కానీ పిల్లల్ని కొట్టకూడదు. అది నేను చేసిన తప్పు. పిల్లలతో పేరెంట్స్ ఫ్రీగా మాట్లాడాలి, అలాగే పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర భయపడకుండా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. అందుకే నేను వరుణ్ , నిహారికలతో ఒక్కటే చెప్పాను. మీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పండి. అది చిన్నదైనా, పెద్దదైనా, చెప్పుకోలేని సమస్యైనా నాకు చెబితే నేను సాల్వ్ చేస్తా అని. ఎందుకంటే మీకు నాకంటే విలువైన వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరని చెప్పాను.. నా పిల్లలతో స్వేచ్ఛగా ఉండడం, వాళ్ళు నా దగ్గర ఫ్రీగా ఉండడంతో మా మధ్యన ఎలాంటి దాపరికాలు లేవని చెబుతున్నాడు నాగబాబు.

ఇక దాదాపు ఏడేళ్లు పాటు ఈటీవీ ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు రీసెంట్ గా ఆ షో నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగులో ‘అదిరింది’ అనే కొత్త షోకి జడ్జిగా పోగ్రాం స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. నాగబాబుతో పాటు ఆయన తో పాటు జబర్దస్ లో చేసిన కమిడయన్స్  చమ్మక్ చంద్ర, ఆర్పీ, ధనరాజ్, వేణులు అదిరింది షోకి టీం లీడర్స్‌గా  చేస్తున్నారు. 

అలాగే.. జబర్దస్త్ షో నుండి ముందే బయటకు వచ్చేసిన నితిన్ భరత్‌లు అదిరింది షోని డైరెక్ట్ చేస్తున్నారు. వీరందరితో కలిసి .. జీ తెలుగులో ఆదివారం నాడు ‘అదిరింది’ షో టెలికాస్ట్ అవుతోంది. అయితే ఈ షోకు వచ్చిన టీఆర్పీలు  ఏమీ గొప్పగా ఉండటం లేదని వినికిడి.  జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వంటి వారు వచ్చి పోగ్రాం చేసినా ఈ స్దాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు.  

జీతెలుగులో అదిరింది అనే పోగ్రాం..జబర్దస్త్ కు పోటీగా వస్తోందనే విషయం గుర్తు పెట్టుకుని ఎంత మంది చూసారనేది ఇక్కడ చూడాలని అంటున్నారు. అలాగే జబర్దస్త్ పోగ్రాం ఎప్పటినుంచో ఉంటోంది కాబట్టి , పోగ్రాం ఎలా ఉన్నా దానికుండే వీక్షకులు దానికి ఉంటారు. అదే అదిరింది కు మైనస్.