Asianet News TeluguAsianet News Telugu

`కల్కి`లో మిస్టేక్స్ ఒప్పుకున్న నాగ్‌ అశ్విన్‌.. అలా ఎందుకు జరిగిందో వివరణ.. హుందాతనం అంటే ఇదే..

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ `కల్కి 2898 ఏడీ`లో లోపాలను ఒప్పుకున్నారు. అందులో జరిగిన మిస్టేక్స్ ని హుందాతనంతో ఒప్పుకోవడం విశేషం. దానికి కారణం ఏంటో వివరించారు. 
 

nag Ashwin agree mistakes criticism on kalki 2898 ad arj
Author
First Published Jul 7, 2024, 7:03 PM IST | Last Updated Jul 7, 2024, 7:04 PM IST

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. `కల్కి 2898 ఏడీ` సినిమాలో ఆయన సృష్టించిన సరికొత్త ప్రపంచాన్ని ఆడియెన్స్ కొత్తగా ఫీలవుతున్నారు.  ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ సత్తా చాటుతుంది. ఇప్పటికే  సినిమా నార్త్ అమెరికాలో 130కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఓవర్సీస్‌లో రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా సినిమా హవా నడుస్తుంది. 

ఈ నేపథ్యంలో సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని లోపాలు జరిగాయి. ఆడియెన్స్ అసంతృప్తికి సంబంధించిన విషయాలున్నాయి. వాటి ప్రస్తావన వచ్చింది. దీనిపై నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. జరిగిన తప్పుని ఒప్పుకున్నారు. అదే సమయంలో ఎందుకు జరిగిందో తెలిపారు. తన హుందాతనం చాటి చెప్పారు. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. సినిమాలో ఫస్టాఫ్‌లో ఎంత సేపూ కథ ముందుకు సాగదు, పైగా పెద్దగా కథ లేదు. పాత్రని పరిచయం చేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. ఇవన్నీ కాస్త బోర్‌ ఎలిమెంట్లుగా నిలిచాయి. అలాగే ఎమోషన్స్ ఏమాత్రం కనెక్ట్ కాలేదు. మ్యూజిక్‌ సింక్‌ మిస్‌ అయ్యింది. క్లారిటీ మిస్‌ అయ్యింది. ఈ విమర్శలు ఇటీవల నాగ్‌ అశ్విన్‌కి ఎదురయ్యాయి.

దీనిపై ఆయన స్పందిస్తూ, మొదట సినిమాని ఒక పార్ట్ గానే తీయాలనుకున్నా. కానీ ఇరవై శాతం తీశాక ఒకే సినిమాలో దీన్ని చూపించడం కష్టమనిపించింది. అందుకే రెండు పార్ట్ లుగా చేయాలని నిర్ణయించుకున్నా అని చెప్పారు నాగ్‌ అశ్విన్‌. ఈ క్రమంలో సినిమాపై కొంత జస్టిఫికేషన్‌ మిస్‌ అయ్యిందన్నారు. సైన్స్ ఫిక్షన్‌ ఎలిమెంట్లని క్రియేట్‌ చేసే క్రమంలో ఎమోషన్స్ మిస్‌ అయి ఉండొచ్చు. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన రైటింగ్‌ పార్ట్ చాలా టఫ్‌ జాబ్‌ అని, నాలుగు పాత్రలని రాయడం అంత ఈజీ కాదన్నారు. 

ఈ విషయంలో ఇంకా బాగా చేయగలను. టైమ్‌ లేదని వెల్లడించారు. సినిమాని రెండు భాగాలుగా చేసే క్రమంలో ఎమోషన్స్ తగ్గిపోయాయని, ఆ విషయంలో తాను నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు. ఇంతటి అద్భుతమైన సినిమాని చేసిన నాగ్‌ అశ్విన్‌.. జరిగిన చిన్న పొరపాట్లని హుందాతనంతో ఒప్పుకోవడమనేది చాలా పెద్ద విషయం. ఈ విషయంలో ఆయన్ని అభినందించాల్సిందే. 

ఇక ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె పాత్రల ప్రధానంగా సినిమా సాగిన విషయం తెలిసిందే. వీటితోపాటు శోభన, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ పాత్రలను సైతం బలంగా చూపించారు. అలాగే దిశా పటానీ, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్‌, బ్రహ్మానందం, అలా మెరిశారు. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా గత వారం విడుదలై రూ.800 కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. భారీ విజయం దిశగా ముందుకెళ్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios