ఈమధ్య కొత్త దర్శకులను పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తన సక్సెస్.. ఫెయిల్యూర్ కు సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నాడు. ఇక రీసెంట్ గా న్యూ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నానీ..?
నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాల సెలక్షన్ లో ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు మార్చి.. సక్సెస్ ను వెతుకుంటూ వెళ్తుంటాడు. మొనాటనీ అయిపోతుంది నాని నటన...ఎప్పుడు చేసిందే చేస్తున్నాడు అన్న విమర్ష రావడంతో.. నాని ఎప్పటికప్పుడు రూట్ మార్చుతూ ఉన్నాడు. ప్రయోగం చేస్తేనే లైఫ్ ఉంటుంది అనుకున్నాడో ఏమో.. అన్ని సినిమాలు డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా.. కొత్త డైరక్టర్లను సెలక్ట్ చేసుకుంటున్నాడు నాని.
ప్రస్తుతం నేచురల్ స్టార్ దసరా సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమాలో ఎప్పుడు లేనంతగా మాస్ పాత్రను పోషించబోతున్నాడు. మాస్ అండ్ యాక్షన్ మూవీ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతొంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే.. మరో రెండు సినిమాలు అడ్వాన్స్ గా ఉంటున్నాడు నాని. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల అవ్వక ముందే మరో మూవీని లైన్ లో పెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నాని ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడుని పరిచయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాప్ నడుస్తోంది.
దసర సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్నాడు నాని. శ్రీకాంత్ ను ఈసినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న నాని.. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని లాంచ్ చేయనున్నాడని సమాచారం. మోహన్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నాని వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని నాని కెరీర్ లో మునుపెన్నడూ రాని డిఫరెంట్ స్టోరీ లైనప్ తో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
ఎలాంటి క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోతాడు నేచరల్ స్టార్ నాని. నేచురల్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూ.. సర్ ప్రైజ్ లు ఇస్తుంటాడు. రీసెంట్ గా శ్యామ్ సింగారాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాని. ఈసినిమాలో తన లుక్ తో పాటు ఆహార్యంతో ఆకట్టుకున్నాడు. అయితే ఈసినిమా తరువాత చేసిన మరో ప్రయోగం మాత్రం విఫలం అయ్యింది. నానీ అంటే సుందరానికి సినిమా మాత్రం ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
