పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్ లో వాళ్ల జోష్ చూసి ఆడియన్స్ లో కూడా ఎనర్జీ పెరుగుతుంటుంది. తాజాగా పూరి రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో కూడా హీరో రామ్ పాత్రను హైపర్ యాక్టివ్ గా డిజైన్ చేశారు. 

రామ్ తో పాటు హీరోయిన్ల పాత్రల్ని కూడా అలానే డిజైన్ చేశారు. ముఖ్యంగా నభా నటేష్ పాత్రని బాగా హైపర్ గా చూపిస్తున్నారు. ట్రైలర్ లో ఆమె రౌడీలా డైలాగులు కూడా చెప్పింది. రామ్ పాత్రకు ఏమాత్రం తీసిపోకుండా నభా పాత్ర కూడా ఉంటుందని టాక్.

ఈ సినిమాలో రామ్ అందరినీ కొడుతుంటే రామ్ ని మాత్రం నభా కొడుతుందట. ఈ విషయాన్ని నభానే స్వయంగా వెల్లడించింది. ''ఈ సినిమా కోసం రామ్ నా చేతిలో దెబ్బలు తిన్నాడు. అదెందుకో సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది'' అంటూ చెప్పుకొచ్చింది. తను చిన్నప్పటి నుండి చాలా హైపర్ గా ఉండేదాన్ని అని.. ఇప్పుడు తనకు అలాంటి పాత్రలే వస్తున్నాయని చెప్పింది.

ఈ సినిమా కోసం నభా తెలంగాణా యాసని ప్రత్యేకంగా నేర్చుకుందట. తెలంగాణా యాస మాట్లాడడం తనకు చాలా కష్టంగా అనిపించేదని.. అందుకే కాస్త టైం పట్టిందని.. అయితే డబ్బింగ్ మాత్రం చెప్పుకోలేదని.. త్వరలోనే ఆ ప్రయత్నం కూడా చేస్తానని అంటోంది. ప్రస్తుతం నభా.. రవితేజ నటిస్తోన్న 'డిస్కో రాజా' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా గనుక హిట్ అయితే టాలీవుడ్ లో నభాకి అవకాశాలు పెరగడం ఖాయం.