రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అవుతున్నా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు ఆర్ఆర్ఆర్ కు. దేశానికి ఆస్కార్ ను అందించిన ఈసినిమా పాటలు.. విదేశాల్లో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. తాజగాగా ఆర్ఆర్ఆర్ నాటు సాంగ్ పరిమళంతో.. లండన్ వీధులు మురిసిపోయాయి.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి చెక్కిన అద్భుత కళా ఖండం ఆర్ఆర్ఆర్. అల్లురి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా .. దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు సాధించింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామరూన్ లాంటివారు ఈ సినిమాను చూసి.. ప్రశంసించారంటే.. మన తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కు ఎగబాకింది అనడంలో అతిషయోక్తి లేదు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ కు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా స్థాయి మరికొన్నిరెట్టలు పెరిగింది.
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటేసింది, ఆస్కార్ గెలిచి కూడా చాలారోజులు అవుతోంది. కాని ఇంకా ఈ సినిమా క్రేజ్ కాని.. నాటు నాటు పాట క్రేజ్ కాని ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ పాటకి లండన్ వీధుల్లో 700 మంది డాన్స్ వేసి అదరగొట్టేశారు. ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహిళలంతా చీరల్లో నాటు నాటు పాటకి కాలు కదిపారు. లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో ఈ ప్రదర్శన జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఈవీడియోలను ఇంకా వైరల్ అచేస్తున్నారు.
ఇక ఇప్పటి వరకూ ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది నాటునాటు పాట. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు.. ఈ పాట కూడా ప్రత్యేకంగా అవార్డ్స్ అందుకుంది.
ఇక దేశ వ్యాప్తంగా కూడా అవార్డ్స్ అందుకోవడం కోసం రెడీ అవుతుంది. ఆర్ఆర్ఆర్. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ నామినేషన్ లో అత్యధికంగా ఆర్ఆర్ఆర్ 11 విభాగాల్లో నానిమేట్ అయ్యింది. ఇక ఆలియా భట్, ఓలివియో హీరోయిన్లు గా నటించిన ఈసినిమాలో సముద్రఖని, అజయ్ దేవగణ్, శ్రీయా శరణ్ ప్రత్యేక పాత్రల్లో మెరిశారు. కీరవాణిసంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది.
