ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆస్కార్ అవార్డ్స్ వేదికపై హోస్ట్ గా మెరిశారు. బ్లాక్ డ్రెస్ లో దీపికా పదుకొనె మెరుపులు మెరిపిస్తూ వేదికపైకి వచ్చింది.
ప్రపంచ సినిమాలో అత్యుత్తమ అవార్డుల వేడుక అయిన అకాడమీ అవార్డ్స్ ఘనంగా ప్రారంభం అయింది. మన నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుస్తుందా లేదా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు ఇండియా నుంచి డాక్యుమెంటరీ ఫిలిం ఆల్ దట్ బ్రీత్స్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పర్స్ కూడా నామినేషన్స్ లో నిలిచాయి.
ప్రౌడ్ మూమెంట్...
ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆస్కార్ అవార్డ్స్ వేదికపై హోస్ట్ గా మెరిశారు. బ్లాక్ డ్రెస్ లో దీపికా పదుకొనె మెరుపులు మెరిపిస్తూ వేదికపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి దీపికా పదుకొనె ఆస్కార్స్ కి హాజరైన వారందరికీ బ్రీఫ్ గా వివరించింది. దీపిక నాటు నాటు ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రసంగాన్ని విన్న ఫ్యాన్స్ అంతా ప్రౌడ్ మూమెంట్ అంటూ కొనియాడారు. దీపిక నల్లటి డ్రస్ లో చందమామలా మెరిసిపోతూ వేదికపై RRR గురించి మాట్లాడుతుంటే సభ అంతా చప్పట్లతో మార్మోగింది. దీపికా ప్రసంగాన్ని చూసిన నెటిజెన్లు వావ్ అంటున్నారు.
నాటు నాటు సాంగ్ గురించి చెప్పగానే ఆడిటోరియం మొత్తం కేరింతలు, చప్పట్లతో మారుమోగింది. నాటు నాటు సాంగ్ లైఫ్ పెర్ఫామెన్స్ కి దీపికా పదుకొనె.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లని ఆహ్వానించింది. రాహుల్, కాలభైరవ హుషారెత్తించేలా నాటు నాటు సాంగ్ ని పడుతూ ఆస్కార్ వేదికపై దుమ్ము దులిపారు. నాటు నాటు సాంగ్ లైఫ్ పెర్ఫామెన్స్ కి ఆస్కార్స్ లో స్టాండింగ్ ఒవేషన్ లభించింది.
