‘మోదీ మోదీ’గా మారిన ‘నాటు నాటు’.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రచార గీతంగా ఆస్కార్ విన్నింగ్ సాంగ్

గ్లోబల్ సెన్సేషన్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ క్యాంపెయిన్ కోసం ఆపాటను ‘మోదీ మోదీ’గా మార్చడం ఆసక్తికరంగా మారింది. 

Naatu Naatu song becomes modi modi in Bjp Campain ahead of Karnataka Election 2023 NSK

 గ్లోబల్ సెన్సేషన్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే.  అప్పటి నుంచి ఏదో రకంగా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. భారతీయులే కాకుండా జపాన్, యూఎస్, ఉక్రెయిన్ వంటి దేశస్తులు కూడా ఈపాటను ఎంతగానో ఆదరించారు. ఆస్కార్ గెలుచుకున్నాక మరింతగా వ్యాప్తి చెందింది. ఆ సాంగ్ కున్న క్రేజ్ ను ఆయా రంగాల్లోనూ వినియోగిస్తున్నారు. 

రీసెంట్ గా ఐపీఎల్2023 ఓపెనింగ్ వేడుకల్లోనూ Naatu Naatu సాంగ్ ను వినిపించారు. దాంతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇక తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ నాటు నాటు క్రేజ్ కనిపించింది. అయితే మేలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు కేవలం నెల రోజులే సమయం ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్, సెక్యులర్ జనతాదళ్ సహా పార్టీలు చురుగ్గా పనిచేస్తున్నాయి.

అయితే, బీజేపీ పార్టీ తమ ప్రచారాన్ని వినూత్నంగా కొనసాగిస్తోంది. తాజాగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న 'నాటు నాటు' పాటకు బీజేపీ వెర్షన్‌ను రూపొందించారు. నాటు నాటుకు బదులుగా ‘మోదీ మోదీ’ని చేర్చి సాంగ్ ను విడుదల చేశారు. పాటలో ప్రజలకు తమ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.  ఒక టీ అమ్మే వ్యక్తి తన దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్‌ను అతికించడం, అతని కస్టమర్ అదేంటని ప్రశ్నించడంతో ట్రాక్ ప్రారంభమవుతుంది.  

బీజేపీ ప్రభుత్వ విజయాలను ఎత్తిచూపేందుకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ను ఇలా రీమిక్స్ చేశారు. దీనిపై ఆయన ఇలా స్పందించారు. ఈ పాట భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) యువజన విభాగం ఆలోచన నుంచి వచ్చిందన్నారు. సాంగ్ లో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. శివమొగ్గ విమానాశ్రయం, బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో లైన్‌లు మరియు గత మూడేళ్లలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను సాహిత్యంగా రూపకంగా చెప్పారు. 

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల్లో పోలైన ఓట్లను మే 13న లెక్కించి, అదేరోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల పనులను ముమ్మరంగా చేస్తున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios