వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్నాడు అల్లరి నరేష్. సహ నటుడుగా చేసిన మహర్షి తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. మొన్న రిలీజైన బంగారు బుల్లోడు డిజాస్టర్. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’ పై ఉంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల అనే కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తూంటే అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూద్దాం.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా దాదాపుగా రూ.2.5 కోట్లను బిజినెస్ చేసిందని అంటున్నారు. నైజాంలో 1కోటి రూపాయల ధర పలుకగా.. సీడెడ్ లో 30లక్షలు, ఆంద్రప్రదేశ్ లో మొత్తంగా 1.2కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. అంటే మూడు కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించినట్లే అంటూ ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. నరేష్ సినిమాలు గతంలో పది నుండి ఇరువై కోట్ల వరకు కూడా రాబట్టిన సందర్బాలు ఉన్నాయి. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు కోట్లు రాబట్టడమే చాలా గొప్ప విషయం. మరి నాంది ఈ సింపుల్ బ్రేక్ ఈవెన్ ను సాధించేనా చూడాలి.
అల్లరి నరేష్ దృష్టి మొత్తం నాంది మీద ఉంది. ఈ సినిమాపై అల్లరి నరేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. థియోటర్ లో రిలీజ్ అయితే తిరిగి తను ఫామ్ లోకి వస్తానని ఆశిస్తున్నారు. ఈ సినిమాని జీ స్టూడియోస్ వాళ్ళు ఈ సినిమాను గుంపగత్తగా ఎనిమిదిన్నర కోట్లకు కొనేసినట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమానుఇలాగే కొనేసిన జీ స్టూడియోస్ లాభం సంపాదించారు. దాంతో వాళ్లే ‘నాంది’ని కూడా కొన్నారట. రూ.8.5 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తవుతుందని.. రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం. ఈ డీల్‌లో థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి ఉంటాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ తరహాలోనే ముందు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసి.. మరి కొన్ని రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వదులుతారని చెప్తున్నారు.
ఇక సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ లాయర్ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్ అనే పోలీస్ పాత్రలో హరిశ్ ఉత్తమన్, సంతోష్‌గా నటుడు ప్రవీణ్ కనిపించనున్నారు. లాక్‌డౌన్ కంటే ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కథ: తూమ్ వెంకట్, సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కూర్పు: చోటా కె.ప్రసాద్.