Asianet News TeluguAsianet News Telugu

బన్నీ, మహేష్ కాంప్రమైజ్.. కుదిరిన డీల్ ఇదే..

  • ఏప్రిల్ లో ఒకేసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బన్నీ,మహేష్ సినిమాలు
  • రెండు సినిమాలు ఒకేససారి రిలీజ్ అయితే ఇబ్బందులు తప్పవని నిర్మాతల ఫీలింగ్
  • తాజాగా రిలీజ్ తేదీల మార్పు చేసుకుని అడ్జస్ట్  చేసుకునేందుకు డీల్
na peru surya na illu india compromise with mahesh bharath anu nenu

మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల విడుదల విషయంలో నెలకొన్న పోటీకి తెరపడనుందా.. అంటే అవుననే వినిపిస్తోంది.  అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య'ను ఏప్రిల్ 27నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకోగా... మహేష్ బాబు 'భరత్ అనే నేను' కూడా అదే  సమయంలో ప్లాన్ చేశారు. నిజానికి మహేష్ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉన్నా.. అది వాయిదా పడింది. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకే రిలీజ్ డేట్‌తో వస్తే కష్టమని ఇరు సినిమాల నిర్మాతల ఆందోళన చెందుతున్నారు.

నా పేరు సూర్య, భరత్ అనే నేను సినిమాలపై దాదాపు రూ.200కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లు టాక్. ఇంత భారీ బిజినెస్ జరిగిన సినిమాలు పోటీ లేకుండా దిగితేనే కలెక్షన్లు భారీగా రాబట్టగలవు. ఒకవేళ పోటీ ఉంటే మాత్రం.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప కలెక్షన్లపై ఎఫెక్ట్ తప్పదు.

రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో ఇప్పుడీ రెండు సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్స్ విషయంలో సర్దుబాటు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాలు ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారని టాక్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో స్పీడప్ బట్టి ఏ సినిమా ముందు రావాలనే దానిపై ఒక అంచనాకు రాబోతున్నారట. ముందు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమా.. ఏప్రిల్ 13న విడుదల కాబోతుంటే.. ఆ తర్వాత రాబోయే సినిమా ఏప్రిల్ 27నాటికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

రిలీజ్ డేట్స్ సంగతి పక్కనపెడితే.. అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' టీజర్‌కు మంచి స్పందన రావడంతో.. సినిమాను ఏడు భాషల్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు నిర్మాతలు. అల్లు అర్జున్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తెలుగు, తమిళం, మలయాళంలోనే కాకుండా హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో 'నా పేరు సూర్య' విడుదలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios