Asianet News Telugu

సల్మాన్‌తో ‘మైత్రీ’ సినిమా...డైరక్టరే సమస్య

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్‌ చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌. సల్మాన్‌తో చర్చలు కూడా పూర్తయ్యాయి. 2022లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అంతవరకూ ప్లానింగ్ బాగుంది కానీ ఇప్పుడు సల్మాన్ ని డైరక్ట్ చేసే డైరక్టర్ ఎవరనే సమస్య మైత్రీకి పట్టుకుంది.

Mythri needs a director for Salman Khan? jsp
Author
Hyderabad, First Published Jul 10, 2021, 8:49 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి చిత్రాలతో ఆరంభంలోనే వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్న బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్‌. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు ఈ సంస్థ అధినేతలు వై. రవిశంకర్, నవీన్‌ యర్నేని. ఈ నిర్మాణ సంస్థ బాలీవుడ్‌లో తొలి అడుగు వేయనుంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్‌ చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌. సల్మాన్‌తో చర్చలు కూడా పూర్తయ్యాయి. 2022లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అంతవరకూ ప్లానింగ్ బాగుంది కానీ ఇప్పుడు సల్మాన్ ని డైరక్ట్ చేసే డైరక్టర్ ఎవరనే సమస్య మైత్రీకి పట్టుకుంది.

అందుతున్న సమాచారం మేరకు సుకుమార్ ని, కొరటాల శివ ను సల్మాన్ ని డైరక్ట్ చేయమని అడగటం జరిగిందిట. అయితే వారు వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో సల్మాన్ డైరక్ట్ చేసే స్టామినా ఉన్న తెలుగు డైరక్టర్ కోసం అన్వేషణ జరుగుతోందిట. అలాగే ఆ డైరక్టర్ సల్మాన్ కు నచ్చాలి. సల్లూ భాయ్ అభిమానులకు నచ్చే మాస్ కథ చేయగలిగి ఉండాలి. పూరి జగన్నాథ్ ని సీన్ లోకి తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా మైత్రీ వారికి ఉందిట. అయితే ఇప్పుడు పూరి తన దర్శకత్వంలో వచ్చే సినిమాలు తన బ్యానర్ లోనే చేసుకుంటున్నాడు. మరో ప్రక్క సల్మాన్ కు టచ్ లో ఉన్న హిందీ డైరక్టర్స్ కథలు కూడా వింటున్నారట. 

ఒకవేళ ఆ కథ సల్లూ భాయ్‌కు నచ్చి,డైరక్టర్ సెట్ అయ్యితే.. త్వరలోనే మైత్రీ సంస్థ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. కాగా తెలుగులో మైత్రీ సంస్థ రీసెంట్ గా  వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ఉప్పెన తో పెద్ద హిట్ కొట్టారు. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలోనూ ప్లానింగ్ ఉందిట. ఇక అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వీటితో పాటు పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ చిత్రాన్ని ఈ సంస్థ నిర్మించనుంది. అలాగే ప్రభాస్‌తోనూ ఓ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios