రామ్ చరణ్ తోనూ ముందుకు వెళ్లాలనుకున్నారు. అదీ జరగలేదు. దాంతో ఈ సారి ట్రాక్ మార్చి తమిళ హీరోను సీన్ లోకి తెచ్చారు.
అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను రాఘవపూడి . తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆ తర్వాత ఆ స్దాయి సక్సెస్ ని అందుకోలేకపోయాడు. వరస ప్రేమ కథలు తీసిన ఈయన 'పడి పడి లేచే మనసు" వంటి డిజాస్టర్ ఇవ్వటంతో ఇండస్ట్రీ దూరం పెట్టేసింది. అయితే గోడకు కొట్టిన బంతిలా... సీతారామం సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా పప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో దుల్కర్, మృణాల్ తమ నటనతో కటిపడేశారు. అలాగే సీతారామం సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించి మెప్పించింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి ఎలాంటి సినిమా తీయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్మాతలు సైతం హను రాఘవపూడి ముందు క్యూ కడుతున్నారు. అయితే ఈ సారి ఆచి,తూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. చాలా మంది హీరోలను ట్రై చేసారు కానీ ఎవరూ వర్కవుట్ కాలేదు. నాని, హను రాఘవపూడి కాంబినేషన్ సెట్ చేద్దామని మైత్రీ మూవీస్ వారు ప్రయత్నం చేసారు కానీ వర్కవుట్ కాలేదు. రామ్ చరణ్ తోనూ ముందుకు వెళ్లాలనుకున్నారు. అదీ జరగలేదు. దాంతో ఈ సారి ట్రాక్ మార్చి తమిళ హీరోను సీన్ లోకి తెచ్చారు. అతనే సూర్య...అతను కథ విని ఓకే చేసారని సమాచారం. అయితే ప్రాజెక్టుని ప్యాన్ ఇండియా స్దాయిలో తెరకెక్కించారని కండీషన్, దాంతో పెరగబోయే బడ్జెట్ ని పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తారని తెలుస్తోంది.
"సీతారామం" సినిమా లాగానే ఇది కూడా ఒక పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. నిజానికి ఇది హను రాఘవపూడి డ్రీమ్ ప్రాజెక్టు కూడా అని సమాచారం. ఇప్పటిదాకా ఒక సూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత ప్రేక్షకులు తన సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి సినిమా తీయాలని హను రాఘవపూడి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారట. ఈ సినిమా తీయాలని ఆలోచన హను రాఘవపూడి కి ఎప్పటినుంచో ఉందట. తాజాగా "సీతారామం" సినిమా హిట్ అవడంతో ఇక తన డ్రీం ప్రాజెక్టును కూడా మొదలుపెట్టేద్దామని నిర్ణయించుకున్నారు హను రాఘవపూడి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే సూర్యకు తొలి తెలుగు చిత్రం అవుతుంది.
