అద్భుతమైన ప్రేమకథతో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంద‌ని టైటిల్‌ని బ‌ట్టి అర్థమ‌వుతోంది. ఈ మూవీలో సుధీర్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి న‌టించటం కలిసి వచ్చే అంశం.

దర్శకుడు ఇద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఉప్పెన‌తో స్టార్ అయిపోయిన కృతి శెట్టి హీరోయిన్. ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ అనే నిర్మాణ సంస్థ తెర‌కెక్కిస్తోంది. ఇప్పుడు మైత్రీ మూవీస్ కూడా చేతులు క‌లిపింది. ఈ సినిమాలో మైత్రీ కూడా భాగం అయ్యింద‌ని చిత్ర‌టీమ్ అఫీషియల్ గా ప్ర‌క‌టించింది. చిన్న సినిమాలు వరసగా తెర‌కెక్కించాల‌ని మైత్రీ నిర్ణయం తీసుకుని ఈ సినిమాతో జాయిన్ అయ్యింది. ఇదో ల‌వ్ స్టోరీ అని సమాచారం.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అందమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. త్వరలో ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. త‌న సినిమాల‌కు పెట్టే టైటిల్స్ విష‌యంలో చాలా శ్రద్ధ తీసుకొని, ఆస‌క్తి రేకెత్తించే తెలుగు టైటిల్స్ పెట్టే మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి మ‌రోసారి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేలా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్ పెట్టడం కలిసి వస్తోంది. అద్భుతమైన ప్రేమకథతో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంద‌ని టైటిల్‌ని బ‌ట్టి అర్థమ‌వుతోంది. ఈ మూవీలో సుధీర్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి న‌టించటం కలిసి వచ్చే అంశం.

త‌న సినిమాల్లో హీరోయిన్ రోల్స్‌కు చాలా ప్రాముఖ్యం ఇచ్చి, వారిని తెర‌పై బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసే ఇంద్రగంటి ఈ సినిమాలోనూ కృతిని అంతే అందంగా ప్రెజెంట్ చేస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై గాజుల‌ప‌ల్లి సుధీర్ బాబు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి.మ‌హేంద్రబాబు, కిర‌ణ్ బ‌ల్లప‌ల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం సమకూరుస్తుండగా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాహి సురేష్‌‌, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె. వెంక‌టేష్ పనిచేస్తున్నారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ళ్యాణీ న‌ట‌రాజ‌న్‌ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.
 Also Read Lock down effect on RRR:.'ఆర్ ఆర్ ఆర్'కు ఎన్ని కోట్లు లాస్..?