Lock down effect on RRR:.'ఆర్ ఆర్ ఆర్'కు ఎన్ని కోట్లు లాస్..?
ఆల్రెడీ పెద్ద ఎత్తున జనవరి 6వ తేదీన రాత్రి ప్రీమియర్ షో లకి రంగం అటు ఓవర్సీస్ సహా ఇక్కడ మన దగ్గర కూడా రెడీ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యిపోయింది.
రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో రాజమౌళి చేసిన భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం”.డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వేగంగా అప్ డేట్ లను వదులుతున్నారు. ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మేకర్స్ మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా ఉందట. దీనితో పాటుగా ఈ చిత్రం 3డి లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కొత్తరకం కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని మరోసారి భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ దేశంలో మూడో వేవ్‌కు కారణం అవుతుందని అంచనాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ తీరును అంచనా వేస్తున్న నిపుణులు.. దేశంలో సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ కంటే ఆరు రెట్లు ప్రమాదకరమని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడిప్పుడే కుదట పడుతున్న సినీ పరిశ్రమపై ఏ స్దాయిలో దీని ప్రభావం పడనుందో అని నిర్మాతలు భయాలతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు థియోటర్లలోకు దూకుతున్నాయి.
ఇక ఇప్పటికే కోవిడ్ విషయమై దేశ రాజధాని ఢిల్లీ అప్రమత్తమైంది. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి సంక్రమణ, ఒమిక్రాన్ కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం పదిరెట్లు సిద్ధంగా ఉందని..ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా థర్డ్ వెవ్ ఎఫెక్ట్ తో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతుంటే.. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూతో పాటుగా థియేటర్స్ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ విధించింది ప్రభుత్వం. మరోపక్క ఢిల్లీ లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. దానిలో భాగంగా థియేటర్స్, స్కూల్స్, మల్టిప్లెక్స్ లు అన్ని మూతపడ్డాయి. దానితో బాలీవుడ్ మరోసారి వెనకడుగు వేసింది. అంటే హిందీలో రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీస్ ని వాయిదా వేసుకుంది.
రణవీర్ సింగ్ 83 రిలీజ్ అయిన కొద్దీ రోజులకే నైట్ కర్ఫ్యూలు పెట్టడంతో.. హిట్ టాక్ తెచ్చుకున్న 83 మూవీ కలెక్షన్స్ పై గట్టి దెబ్బ పడింది. ఓవర్సీసీ లో డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 83 కి ముంబై లాంటి సిటీస్ లో అనుకున్నకలెక్షన్స్ రాలేదు. దానితో మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న షాహిద్ కపూర్ జెర్సీని వాయిదా వేశారు మేకర్స్. ఈ క్రమంలో ఆర్ ఆర్ పై ఈ ఇంపాక్ట్ పడనుంది. ఇదే జరిగితే ట్రేడ్ లెక్కలు ప్రకారం వంద కోట్లు పైనే ఆర్ ఆర్ ఆర్ నష్టపోనుందని అంచనా. ఎందుకంటే బాహుబలి చిత్రం డిల్లీ మార్కెట్ లో వంద కోట్లు వసూలు చేసింది. దాంతో 130 కోట్లు దాకా ఈ సినిమా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అవన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది. నార్త్ లో అన్నీ చోట్లా డిల్లీ పరిస్తితే వస్తే....రిలీజ్ డేట్ మార్చుకోవటం బెస్ట్ అంటున్నారు.