Asianet News TeluguAsianet News Telugu

విజయ్ G.O.A.T తెలుగులో అంతకు కొన్నారా, రిస్కా?

 తెలుగు రిలీజ్ హక్కులను  మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. ఆంధ్రా, తెలంగాణలో గోట్ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు సంస్థ  ప్రకటించింది. 

Mythri Movie Makers bought G.O.A.T Greatest of All Times movie rights jsp
Author
First Published Jul 11, 2024, 10:05 AM IST


దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న చిత్రం గోట్ "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" పై ఏ స్దాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే.  ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేయనుంది. అలాగే ఈ చిత్రం రైట్స్ ని భారీ మొత్తానికే కొనుగోలు చేసారని మీడియా వర్గాల సమాచారం. 

 చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక తెలుగు రిలీజ్ హక్కులను  మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. ఆంధ్రా, తెలంగాణలో గోట్ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు సంస్థ  ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రైట్స్ నిమిత్తం 17 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. 

మైత్రీ మూవీస్ వారు సలార్, హనుమాన్ చిత్రాల ఘన విజయంతో దూకుడు మీద ఉన్నారు. అయినా సరే తమిళ ప్రొడ్యూసర్స్ తో బేరాలు ఆడి 17 కోట్లకు ఫైనల్ చేసి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ రేటు పెట్టడానికి కారణం విజయ్ గత చిత్రాలు ఇక్కడ తెలుగులో బాగా పే చెయ్యటమే. వారసుడు చిత్రం 12 కోట్లు దాకా వసూలు చేసింది. లియో చిత్రం 20 కోట్లు దాకా వసూలు చేసింది. దాంతో ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. సినిమా ఏ మాత్రం బాగున్నా నెక్ట్స్ లెవిల్ లో లాభాలు చుస్తామనే నమ్మకంతో మైత్రీవారు ఈ మొత్తం పెట్టడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. 
 
ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో చివరి చిత్రం అంటున్నారు. దాంతో తమిళంలో ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. అలాగే ఆఖరి సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే తెలుగులో అంత సీన్ ఉందా అనేది పెద్ద ప్రశ్న

. ఎందుకంటే విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు అన్నా, చివరి సినిమా అన్నా మీడియా వారికి తప్పించి మిగతా ఎవరినీ ఆ వార్త తెలుగులో ఎట్రాక్ట్ చేయలేదు. ఎందుకంటే విజయ్ తో మనం అంతవరకే కనెక్ట్ అయ్యి ఉన్నాము. రజనీ రాజకీయాల్లోకి వెళ్తున్నారంటేనే తెలుగులో చర్చ జరగలేదు. ఎందుకంటే వాళ్లు వేరే రాష్ట్రం కాబట్టి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రైట్స్ ని విజయ్ కొత్త చిత్రం రైట్స్ క్రింద మాత్రమే లెక్కేయాలి. అంతకు మించి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకూడదు. 
 
ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే గోట్ విడుదల తేదీని అఫీషియల్ గా  ప్రకటిస్తారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios