మరో హాట్ బ్యూటీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న వర్మ

myra sireen is the heroine in nag varma movie
Highlights

  • నాగార్జునతో చాలా కాలం తర్వాత వర్మ సినిమా
  • శివతో సంచలనం సృష్టించిన నాగార్జున, వర్మ
  • మరోసారి ఈ కాంబోలో వస్తున్న చిత్రంలో హాట్ హిరోయిన్

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కింగ్ నాగార్జున, ఆర్జీవీ కాంబినేషన్ లో మమూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభమైన ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం అనుష్క ను ప్లాన్ చేసుకున్నా.. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. అయితే వర్మ మాత్రం సడెన్ గా మరో ట్విస్ట్ ఇచ్చాడు. తన సినిమాలలో హీరోయిన్స్ ను హాట్ హాట్ గా.. చూపించే వర్మ మైరా సరీన్ అనే ఓ కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. 

 

వర్మ ఫేస్ బుక్ పేజీలో హిరోయిన్ కు సంబంధించిన పోస్ట్ కూడా పెట్టాడు. ఆమె ఫొటోలు కూడా షేర్ చేశాడు. "నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి అవన్నీ తప్పు హీరోయినిగా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి తన పేరు మైరా సరీన్. ఈ ఫొటోలు ఆ అమ్మాయివి." అంటూ వర్మ పెట్టిన పోస్ట్ చూసి చాల మంది షాక్ అయ్యారు.

 

దాదాపు 55 సంవత్సరాలు పై పడ్డ నాగార్జున ఒక కొత్త బొంబాయి బ్యూటీతో కలిసి రోమాన్స్ చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా ? అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈసినిమా ప్రీ-లుక్ లో భాగంగా నాగార్జునను రఫ్ లుక్ లో చూపించిన వర్మ మైరాను కూడా అదే విధంగా ప్రజెంట్ చేస్తూ తుపాకి పట్టుకున్న స్టిల్స్ తో పాటు తన మార్క్ హాట్ లుక్స్ తో కూడా కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశాడు. 

 

‘హలో’చిత్రం విడుదల తరువాత ఈమూవీ కొత్త షెడ్యూల్ లో ఈమె షూటింగ్ లో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా హిట్ అయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్థుతం వెలితిగా వున్న హాట్ హీరోయిస్స్ కొరతకు పరిష్కారం దొరుకుతుందో చూడాలి.

loader