రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రాణాలతో లేరనే చేధు నిజాన్ని ఆయన్ని అభిమానించే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ కృష్ణంరాజు మృతిపై ఎమోషనల్ అయ్యారు. కడసారి చూడలేకపోయాయని చింతించారు.  

రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మృతి విషయాన్ని టాలీవుడ్ సినీ ప్రముఖులు, అలాగే ఇతర ఇండస్ట్రీల్లో ఆయన్ని అభిమానించే వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు రోజుల కింద కృష్ణంరాజు తుదిశ్వాస విడివడటంతో టాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. పొలిటికల్ లీడర్స్ కూడా ఆయన ఇంటికెళ్లి నివాళి అర్పించి.. ప్రభాస్ తో పాటు కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. అయితే తాజాగా కృష్ణంరాజు మరణవార్తపై తాజాగా నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) ఎమోషనల్ గా స్పందించారు. 

కృష్ణంరాజు లేరనే విషయం తెలియగానే ట్వీటర్ వేదికన సంతాపం వ్యక్తం చేశారు. ప్రభాస్, కృష్ణంరాజు తో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకున్నాడు. ఈ సందర్భంగా లారెన్స్ భావోద్వేగ భరితమై ప్రకటనను విడుదల చేశారు. ‘కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నాను. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగే చాలా కేర్ తీసుకునే వారు. ఒక తల్లి పిల్లల లాగే ఆలనా పాలనా చూస్తుకున్నారు. సెట్లో ప్రతి ఒక్కరూ తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారు. తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారు’ అని చెప్పుకొచ్చారు. 

అలాగే తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం మూలంగా రాలేకపోయానని, చివరి చూపు కూడా నోచుకోలేకపోవడం తన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు లారెన్స్ ఆకాంక్షించారు. మొయినాబాద్ దగ్గర్లోని కనకమామిడి ఫాంహౌజ్ లో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ప్రశాంతంగా ముగిశాయి. కాగా, ప్రస్తుతం లారెన్స్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో కలిసి ‘రెబల్’ అనే సినిమాను రాఘవ లారెన్స్ దర్శకత్వంతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాఘవా ‘చంద్రముఖి -2’లో నటిస్తున్నారు. 

Scroll to load tweet…