నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు... పబ్లిక్ లో నటి రాఖీ సావంత్ రచ్చ!
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ తనను మోసం చేస్తున్నాడంటూ బరస్ట్ అయ్యారు.

రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ ని ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన రాఖీ సావంత్ కన్నీరు పెట్టుకుంటూ భర్తపై అసహనం ప్రదర్శించారు. ఆదిల్ ఖాన్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడంటూ సీరియస్ అలిగేషన్స్ చేశారు. జిమ్ నుండి బయటకు వస్తున్న రాఖీ సావంత్ ని మీడియా చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఆమె బరస్ట్ అయ్యారు. మీరు ఆదిల్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేయకండి. అతడు ఇక్కడి వచ్చేది జిమ్ చేయడానికి కాదు, మీడియా అటెన్షన్ కోసం. నేను కూడా అతని గురించి మాట్లాడను. అతన్ని పాప్యులర్ చేయను. మీ కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడుతున్నా ఆదిల్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేయకండి.
అతడు ఒక అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడు. ఆమెను వదిలేస్తానని ఖురాన్ మీద ఒట్టేసి చెప్పాడు. కానీ ఎఫైర్ నడుపుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆమె వద్ద ఆదిల్ ఖాన్ చీకటి బాగోతానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. ఆదిల్ ఖాన్ పెద్ద అబద్దాల కోరు.. అంటూ సీరియస్ ఆరోపణలు చేశారు. రాఖీ సావంత్ అలిగేషన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
రితేష్ సింగ్ తో విడాకులు తీసుకున్న రాఖీ సావంత్ గత ఏడాది ఆదిల్ ఖాన్ ని వివాహం చేసుకున్నారు. ఏడాది గడవక ముందే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. రాఖీ సావంత్ ఆరోపణల నేపథ్యంలో ఆదిల్ ఖాన్ స్పందన చూడాల్సి ఉంది. కాగా జనవరి 28న రాఖీ సావంత్ తల్లి జయ మృతి చెందారు. క్యాన్సర్ కారణంగా జయ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాఖీ సావంత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక రెండు దశాబ్దాలకు పైగా రాఖీ సావంత్ పరిశ్రమలో ఉన్నారు. తెలుగులో 6 టీన్స్ మూవీలో నటించారు. నితిన్ ద్రోణా మూవీలో ఐటెం సాంగ్ చేశారు.