తెలుగు, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ వరుస సినిమాతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె పీబీఎల్(పూణే బాడ్మింటన్ లీగ్)లోకి అడుగుపెట్టింది. పూణే 7 ఏసేస్ జట్టుకి సహ యజమానిగా వ్యవహరిస్తోంది.

ఈ సందర్భంగా భువనేశ్వర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తొమ్మిదో తరగతిలోనే తాప్సీ ప్రేమలో పడిందట. కానీ తను ప్రేమించిన వ్యక్తి పదో తరగతి పరీక్షలు వస్తున్నాయని తనను వదిలేశాడట.

ఆ సమయంలో ఎంతో బాధ పడ్డానని ఇంటి పక్కనే ఉన్న పీసీవో నుండి తన ఫోన్ చేసి ఏడ్చేదాన్నిఅంటూ చెప్పుకొచ్చింది. నన్ను ఎందుకు వదిలేసావని అతడిని ప్రశ్నించే దాన్ని అని, అవన్నీ తలచుకుంటే నవ్వొస్తుందని తెలిపింది.

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. ''నా వ్యక్తిగత జీవితంలోనూ, నేను చేసే పనిలో నేను హైలైట్ గా ఉండాలనుకుంటాను. నేను పెళ్లాడబోయే వ్యక్తి ఆలోచనలు కూడా నాలానే ఉండాలి. మా అభిప్రాయాలు కలవాలి. తనను చూడగానే మర్యాద ఇవ్వాలని నాకు అనిపించాలి. నేను ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు ఆ విషయం గురించి బయటకి చెప్పేస్తాను'' అంటూ చెప్పుకొచ్చింది