బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్‌ తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఆమె తన పిల్లల గురించి ఓపెన్‌ అయ్యింది. వాళ్లు నా సినిమాలు చూడరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

బాలీవుడ్‌ బ్యూటీ, నిన్నటి తరం కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ కాజోల్‌.. ఆమెపేరు చెబితే `దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే` చిత్రమే గుర్తొస్తుంది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ కథలో మరుపురాని మూవీగా నిలుస్తుంది. అప్పుడు, ఇప్పుడు ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌గా నిలుస్తుంది. ఒకప్పుడు ఓఊపు ఊపిన కాజోల్‌.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో జోరుమీదుంది. ఆమె అటు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌, ఓటీటీ ఫిల్స్ చేస్తూ దూసుకెళ్తుంది. నేటితరం సినిమా అమ్మలకు ఆదర్శనంగా నిలుస్తుంది. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూనే సినిమాల్లో నటిస్తుంది కాజల్. ఇటీవల ఆమె `లస్ట్ స్టోరీస్‌ 2`లో నటించిన విషయం తెలిసిందే. ఈ బూతు ఓటీ ఫిల్మ్స్ కి మొదట దారుణమైన విమర్శలు వచ్చినా, ఆ తర్వాత బాగానే చూస్తున్నారు. అయితే మొదటి పార్ట్ అంతగా సెకండ్‌ పార్ట్ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నంతలో కాజోల్‌ పార్ట్ బాగుందని అంటున్నారు. 

ఈ ఓటీటీ ఫిల్మ్ ప్రమోషన్స్ లో భాగంగా కాజోల్‌ మీడియాతో ముచ్చటించింది. ఆమె తన ఇంట్లో పరిస్థితి గురించి, తన పిల్లల గురించి ఓపెన్‌ అయ్యింది. తాను సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించేటప్పుడు రియల్ లైఫ్‌ తల్లిగా ఫీలై నటిస్తానని తెలిపింది. అయితే రీల్‌ మదర్‌, రియల్‌ మదర్‌ వేరని, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పింది. కానీ తెరపై సహజంగా నటించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంది. ఈ క్రమంలో తన పిల్లల గురించి చెబుతూ, తాను నటించడం తమ పిల్లలకు ఇష్టం లేదని తెలిపింది. 

తెరపై నన్ను చూసేందుకు మా పిల్లలు ఇష్టపడరని, నేను నటించడమంటే వాళ్లకి నచ్చదని, నా సినిమాలు కూడా చూడరని తెలిపింది కాజోల్‌. బలవంతంగా కూర్చోబెట్టి చూపించినా చూడరని వెల్లడించింది. కానీ వారిలో అన్ని గుణాలను తాను ఇష్టపడతానని, ప్రేమిస్తానని పేర్కొంది. తన పిల్లలే కాదు తమ బంధువులు కూడా కొందరు తన సినిమాలు చూడరని తాను ఏడుస్తుంటే చూడటం ఇష్టం లేక వారు ఆ సినిమాలు చూడరని వెల్లడించింది. అయితే తాను ఏడుస్తుంటే వారు చూడలేకపోవడం కూడా నాకు గొప్ప ప్రశంసలా అనిపిస్తుందని కాజోల్ పేర్కొంది.

ఇదిలా ఉంటే `లస్ట్ స్టోరీస్‌2`లో ఆమె ఇంటిమేట్‌ సీన్స్ లో నటించింది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. అయినా వాటికి దీటుగా సమాధానం చెబుతుంది కాజోల్‌. ఇక కాజోల్‌.. కొత్తగా మరో ఫిల్మ్ ని ప్రకటించింది. `దో పట్టి` పేరుతో ఇది రూపొందుతుంది. దీనికి కృతి సనన్‌ నిర్మాత కావడం విశేషం. ఆమె బ్లూ బటర్‌ఫ్లై సంస్థని ప్రారంభిస్తూ దీన్ని నిర్మిస్తుంది. వెబ్‌ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కించనున్నారు. దీంతోపాటు `సర్జామీన్‌` అనే సినిమాలో, `ది ట్రైల్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది కాజోల్‌.