శ్రీలంక క్రికెటర్, సంచలన బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ రైట్స్ ని `యశోద` నిర్మాత సొంతం చేసుకున్నారు. మరోవైపు పల్లెటూరి ప్రేమ కథతో వస్తోన్న `ఏందిరా ఈ పంచాయితీ` గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.
లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, మైదానంలో బంతితో మాయాజాలం సృష్టించిన శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకులు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. '800' ఆలిండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఏడాదిన్నర పాటు చిత్ర బృందం అంతా ఎంతో శ్రమించి సినిమా తీశారు. శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, చెన్నై, కొచ్చిన్, చండీగఢ్‌లో చిత్రీకరణ చేశారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించిన చిత్రమిది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ , ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ... 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత మురళీధరన్ సొంతం. బాల్యం నుంచి ఆయన పడిన స్ట్రగుల్స్, ఆయన జర్నీ అంతా సినిమాలో ఉంటుంది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. రీ రికార్డింగ్, గ్రాఫిక్ వర్క్స్ తుది దశలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న `ఏందిరా ఈ పంచాయితీ` గ్లింప్స్..
విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే సినిమా కూడా రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ లోగో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఊరి వాతావరణం, ఊర్లోని పలు భిన్న మనస్తత్వాలు, లక్షణాలున్న మనుషుల మధ్య సాగే సినిమా అని చెప్పేశారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
‘మంచోడే అంటావా?’ అంటూ హీరోయిన్ డైలాగ్‌తో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది. ‘ఎవరే.. ’ అని హీరోయిన్ ఫ్రెండ్ డైలాగ్.. ‘అదే అభి..’ అంటూ హీరోయిన్ కాస్త హీరో ఇంట్రడక్షన్ గురించి చెప్పడం.. ‘యమునా.. తొందరగా నా గురించి ఏమైనా ఆలోచించొచ్చు కదా?’ అని హీరో అనడం.. (నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా?’ అని హీరోయిన్ డైలాగ్ ఇలా గ్లింప్స్ మొత్తం కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

