యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో బిజీగా మారబోతున్నాడు. ప్రస్తుతం నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న భీష్మ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. గత ఏడాది నితిన్ కి సరిగా కలసి రాలేదు. నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. 

దీనితో నితిన్ ఈ ఏడాది క్రేజీ చిత్రాలని లైన్ లో పెట్టాడు. భీష్మ తర్వాత నితిన్ తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్ రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. దర్శకుడు వెంకీ అట్లూరితో కలసి దేవిశ్రీ, గేయ రచయిత శ్రీమణి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. 

దేవిశ్రీ ప్రసాద్ తో ఇది నా తొలి చిత్రం. పాటలు వినేందుకు చాలా  ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని నితిన్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాల్సి ఉంది.