2024 లో మోత మోగించిన మ్యూజిక్ డైరెక్టర్.. రచ్చ రచ్చ చేశారు
నలుగురు సంగీత దర్శకులు ఈ సంవత్సరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మోత మోగించారు. తమ పాటలతో ఆడియన్స్ ని మెప్పించిన ఆ నలుగురు ఎవరంటే...?
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు.. భారీ డిజాస్టర్స్ కూడా చూశారు మేకర్స్.. మరీముఖ్యంగా ఈ ఏడాది మ్యూజిక్ విషయంలో అద్భుతాలే జరిగాయి. 2024 లో మోత మోగించేశారు మ్యూజిక్ డైరెక్టర్లు మరీ ముఖ్యంగా నలుగురు సంగీత దర్శకులు ఈ సంవత్సరాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకుని మోత మోగించి ఆడియన్స్ ని మెప్పించారు. కుర్చీని మడతపెట్టిన గుంటూరుకారం నుంచి నెక్ట్స్ ఇయర్ రాబోయే గేమ్ చేంజర్ వరకూ అద్భుతాలు చేసిన మ్యూజక్ డైరెక్టర్లు ఎవరంటే..?
తమన్
ఈ ఏడాది కూడా ఎక్కువ భాగం సినిమాలుతన ఖాతాలోనే వేసుకున్నాడు తమన్. 2024 వచ్చీ రావడంతోనే గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాటతో.. ప్రేక్షకుల హృదయాలను మడతెట్టేశాడు. గుంటూరు కారం నుంచి... నెక్ట్స్ రాబోయే గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్ వరకూ ..ఈ ఏడాది సినిమాల జోరు చూపించాడు తమన్. అద్భుతమైన పాటలెన్నో కంపోజ్ చేశాడు. అదే క్రేజ్ ను కంటీన్యూ చేశాడు తమన్.
Also Read: పుష్ప 3 లో రజినీకాంత్, సూపర్ స్టార్ పాత్రేంటో తెలిస్తే షాక్ అవుతారు..?
దేవిశ్రీ ప్రసాద్
ఇక ఈమధ్య జోరు తగ్గినా.. రేంజ్ మాత్రం తగ్గలేదు దేవిశ్రీ ప్రసాద్ కు. పుష్ప సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన దేవిశ్రీ.. ఈసారి పుష్ప2 కి అంతకు మించిన మ్యూజిక్ అందించాడు. థియేటర్లో రికార్డ్ లు బద్దలయ్యే మ్యూజిక్ తో క్యారెక్టర్లకి, సినిమాలకు ఎలివేషన్ ఇచ్చారు దేవిశ్రీప్రసాద్. ఈ ఏడాది దేవిశ్రీ ప్రసాద్ చేసిన పుష్ప2, కంగువ, సినిమాల పాటలకు, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది మరీ ముక్యంగా పుష్ప2 అయితే అల్టీమేట్ అనిచెప్పాలి. ఇక 2025 లో రిలీజ్ అవ్వబోతున్న తండేల్ కూడా దేవి ఖాతాలోనే ఉంది.
అనిరుధ్ రవిచందర్
ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్టర్లుగా తమన్, దేవిశ్రీ కి మధ్యే పోటీ ఉండేది. ఆ స్టార్ డమ్ కూడా ఇద్దరే పంచుకున్నారు టాలీవుడ్ లో. కాని 2024 లో మాత్రం ఈ విషయంలో కాస్త తేడా కొట్టింది. తమిళం నుంచి అనిరుధ్ మ్యూజిక్ కు కాస్త అట్రాక్ట్ అయిన మనవారు.. ఈ కుర్ర దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. ఈ రకంగా తెలుగులోసక్సెస్ ఫుల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు అనిరుధ్. తెలుగులో దేవర మూవీలో మనోడు చేసిన సుట్టమల్లే సాంగ్, దావూదీ సాంగ్ తో ఇండియా వైడ్ ఆడియన్స్ ని అదరగొట్టేశారు.
Also Read: బేబీ బంప్‌తో సమంత.. వైరల్ అవుతున్న ఫోటోస్.. షాకింగ్ ట్వీస్ట్ ఎంటంటే..?
భీమ్స్
ఈ ఏడాది సినిమా రాకున్నా.. తన సాంగ్ తో 2024 లో అద్బుతం చేశాడు భీమ్స్, తన మ్యూజిక్ తో మోత మోగిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం భీమ్స్ స్పెషల్లీ వెంకటేశ్ హీరోగా సంక్రాంతికొస్తున్నాం సినిమాతో పాటు మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాల నుంచి వచ్చిన సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గోదారిగట్ట సాంగ్ అయితే రీల్స్ లో మోత మోగిపోతోంది. ఇలా ఈ నలుగురు డైరెక్టర్లు 2024 లో అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొట్టారు.