ఇండియన్‌ ఐడల్‌కి ధీటుగా రాణిస్తుంది తెలుగు ఇండియన్‌ఐడల్‌ 2. దీనికి విశేష ధారణ దక్కుతుంది. తాజాగా ఇది సెమీ ఫైనల్‌కి వచ్చింది. ఇందులో తమన్‌తోపాటు దేవి శ్రప్రసాద్‌ పాల్గొనడం విశేషం. 

`తెలుగు ఇండియన్‌ ఐడల్‌` పాటల కార్యక్రమం విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా రన్‌ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన గాయకలను వెలికితీసే ఉద్దేశ్యంతో `ఆహా` సంకల్పించిన ఈ షోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. యువ గాయకులు గాన ప్రతిభ తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఇప్పటికే మొదటి సీజన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. రెండో సీజన్‌ కూడా చివరి దశకు చేరుకుంది. మొదటి సీజన్‌లో బాలయ్య, చిరంజీవి లాంటి స్టార్స్ సండి చేశారు. 

ఇప్పుడు రెండో సీజన్‌ అంతే బాగా రణ్‌ అవుతుంది. తాజాగా ఇది సెమీఫైనల్‌కి చేరుకుంది. దీనికి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ థమన్‌ జడ్జ్ గా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే ఈ పాటల కార్యక్రమం `ఆహా`లో విజయవంతంగా రన్‌ అవుతుంది. అయితే తాజాగా మరో మ్యూజిక్‌ సెన్సేషన్‌ దేవిశ్రీ ప్రసాద్‌ తోడయ్యారు. థమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. కానీ ఓ అరుదైన, అద్భుతమైన దృశ్యానికి `ఆహా` నడుం బిగించింది. ఇద్దరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 సెమీ ఫైనల్‌ కోసం దేవిశ్రీ ప్రసాద్‌ గెస్ట్ గా హాజరు కావడం విశేషం. 

ప్రస్తుతం ఈ విషయాన్ని తెలియజేస్తూ వీరి ఫోటోలను పంచుకుంది `ఆహా`. ఇందులో థమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ హగ్‌ చేసుకున్నారు, ఒకరిపై ఒకరు చేతులేసి డాన్సులు చేశారు. పాటలతో అలరించారు. ఇద్దరు కలిసి పాట కంపోజ్‌ చేసి వాహ్‌ అనిపించింది. ఓ అద్భుత దృశ్యాన్ని ఆడియెన్స్ ముందు ఉంచారు. తెలుగు ఇండియన్‌ఐడల్‌ 2 సెమీఫైనల్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ జడ్జ్ గా వ్యవహరించారు. తనదైన మ్యూజికల్‌ టచ్‌తో షోని రక్తికట్టించారు. ఈ షోలో ఈ ఇద్దరు లెజెండ్ మ్యూజిక్‌ డైరెక్టర్లు కలిసి కంపోజ్‌ చేసిన మ్యూజిక్‌ ఎంతగా ఆకట్టుకుంటుందని, శ్రోతలను ఉర్రూతలూగిస్తుందని నిర్వహకులు తెలిపారు. 

మరోవైపు ఇందులో శృతి అనే కంటెస్టెంట్‌(గాయని)తో కలిసి దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన పర్‌ఫెర్మెన్స్ అద్భుతంగా ఉంందని, షోని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉందని, అది అందరిని అలరిస్తుందని చెప్పారు. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 సెమీ ఫైనల్‌లో ఇది హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఆరుగురు సింగర్స్ సెమీ ఫైనల్‌లో పోటీ పడుతున్నారని, ఫైనలిస్ట్ లను మే 19, 20 తేదీల్లో కన్ఫమ్‌ చేస్తారని తెలిపారు. ఫైనలిస్ట్ లతో మరో వారంలో ఫైనల్‌ జరుగుతుందని చెప్పొచ్చు. ఎన్నో విశేషాలు,అద్భుతాలకు కేరాఫ్‌ గా నిలిచిన సెమీ ఫైనల్‌ ఎపిసోడ్‌ని వీక్షించాలని ఆడియెన్స్ కి `ఆహా` వెల్లడించింది.