ఎప్పుడూ కాపీ ట్యూన్స్ అంటూ తమన్ ను ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. ప్రతీసారి ఇలానే వార్తగా మారుతున్నమ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఈసారి మాత్రం ఓ మంచి పని చేసి వైరల్ న్యూస్ అయ్యారు. 

టాలీవుడ్ లో ప్రస్తుతం తమన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. దేవిశ్రీని కూడా వెనక్కి నెట్టి.. సత్తా చాటుకుంటున్నాడు. కాపీ మాస్టర్ అని ఎన్ని విమర్షలు వస్తున్నా.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. సినిమా పాటను అటు తిప్పి, ఇటు తిప్పి, మరో పాటకు బీట్‌ను కంపోజ్ చేస్తారన్న అపవాదు ఉంది తమన్ మీద. కాని సూపర్ హిట్ పాటలు బయటకు తీసి.. స్టార్ హీరోలకు మంచి మంచి హిట్లు ఇవ్వడంతో తమన్ పాత్ర ఎంతో ఉంది. ఈకరమంలో తమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన సంగీతం ట్రోల్ కు గురవ్వలేదు కాని.. ఆయన మంచి మనసు మాత్రం వైరల్ న్యూస్ అవుతోంది. 

తమన్ తన మంచి మనస్సును చాటుకున్నారు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్లకు ఓ బృందం ఉంటుంది. సినిమాలకు సంగీతం చేయడమే కాదు.. దేశ విదేశాల్లో ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు వీరు. ఇక తమన్ కు కూడా ఓ టీమ్ ఉంది. ఆ టీమ్‌లోని మ్యూజిషియన్ ఒకరు అనారోగ్యానికి గురయ్యారట. ఆయనకు క్యాన్సర్ రాగా, కీమో చేయాల్సి వచ్చిందట. తమన్‌కు ఈ విషయం తెలిసి.. అతని బాధను చూసి చలించిపోయారట. అంతే కాదు ఏకంగా 10 లక్షల సాయం కూడా చేశాడట తమన్. అయితే ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పకుండా దాచారు. కాని ఈ విషయాన్ని ప్రముఖ గాయని గీతామాధురి వెల్లడించారు. 

ఆహాలో ప్రసారమౌతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోలో.. ఈ విషయాన్ని గీతా మాధురి వెల్లడించారు. అయితే ఈ సాయం చేసి కూడా ఎన్నో రోజులు అవ్వడంలేదట. రీసెంట్ గానే చేశారట. చిన్న సాయం చేసినా.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తుంటారు జనాలు. అటువంటిది.. తమన్ మాత్రం ఇంత సాయం చేసి కూడా.. ఇలా చెప్పకుండా.. తన గొప్పతనాన్ని నిరూపించుకున్నారు.

అయితే సదరు మ్యూజిషియన్ క్యాన్సర్ వచ్చి... కీమో చేస్తున్న క్రమంలో శరీరం మొత్తం కాలిపోయిందట. ఈ క్రమంలో అతనిని డిశ్చార్జి చేద్దాం అన్నా.. డబ్బులు ఇస్తే గానీ ఆసుపత్రి నుండి పంపేది లేదని చెప్పడంతో.. తమన్ కు విషయం తెలిసి.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారంటూ గీత తెలిపారు. అలా ఆ రోజు ఆ కుటుంబంలో తమన్‌ దేవుడు అయ్యారని ఆమె చెవెల్లడించారు. 

ఇక ఈవిషయంలో అక్కడే ఉన్న తమన్ స్పందించారు. మనిషి అన్నాక ఏదైనా మంచి చేయాలి కదా... సినిమాలకు మ్యూజిక్ చేస్తున్న నేను బయట షోల ద్వారా సంపాదించిన డబ్బును ఛారిటీకి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడాఅదే చేస్తున్నాను అని చెప్పాడు తమన్‌. అలాగే గుంటూరులో ఓ పెద్ద అనాథాశ్రమం కడుతున్నానని. త్వరలోనే పనులు పూర్తి చేసి ఓపెన్‌ చేస్తానని చెప్పారు తమన్‌. ఇక తమన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియాలోనే.. ఆయన్ను దేవుడిగా వర్ణిస్తున్నారు.