బిజి ఎమ్ హైలెట్  అవటం వల్ల నిలిచిన సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఆడిన సినిమాలు ఉన్నాయి. అందుకే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  తో అద్బుతం చేసే సంగీత దర్శకులకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు. ముఖ్యంగా గత కొంతకాలం వరకూ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరైనా బిజిఎమ్ మాత్రం మణిశర్మ తో చేయించుకునేవారు. ఇప్పుడు తమన్ సైతం అదరకొడుతున్నారు.  రీసెంట్ గా మజిలి సినిమాలో తమన్ ఇచ్చిన బిజిఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ నేపద్యంలో ప్రభాస్ సైతం తన తాజా చిత్రానికి తమన్ ని బిజిఎమ్ కోసం ఎంచుకున్నట్లు సమాచారం. 

బాహుబలిగా దుమ్ము దులిపిన ప్రభాస్ ఇప్పుడు సాహో సినిమా బిజీలో ఉన్నారు. చాలా కాలం నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ మధ్యనే ఓ కొలిక్కి వచ్చింది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యుల్ కు చేరుకుంది. మరో ప్రక్క పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ సైతం పూర్తి చేస్తోంది టీమ్.  శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ చేత బిజీఎమ్ ఇప్పించాలని దర్శకుడు ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. 

అయితే ఇందుకు శంకర్ ఎహసాన్ లాయ్ ఒప్పుకుంటాడా లేదా అనేది టీమ్ ముందున్న పెద్ద ప్రశ్న. ఆయన నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలియలేదు. ఎందుకంటే సినిమాకు సంగీతం, రీరికార్డింగ్, బిజీఎమ్ అంతా ఆయన చేతే చేయిస్తామని ఎగ్రిమెంట్ ఉందిట. ఇప్పుడు హఠాత్తుగా తమన్ ని సీన్ లోకి తెస్తే లేనిపోని వివాదాలు రావు కదా అని నిర్మాతలు ఆలోచనలో పడ్డారట.